BigTV English

Gautham Ghattamaneni:బాబు లైనెస్స్ ఉందా? కారుతో రోడ్డెక్కిన మహేష్ బాబు కొడుకు.. ట్రోల్స్ మాములుగా లేవుగా!

Gautham Ghattamaneni:బాబు లైనెస్స్ ఉందా? కారుతో రోడ్డెక్కిన మహేష్ బాబు కొడుకు.. ట్రోల్స్ మాములుగా లేవుగా!

Gautham Ghattamaneni:ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రిటీలే కాదు వారి వారసులు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల తనయుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam ghattamaneni) కూడా తాజాగా వార్తల్లో నిలిచారు. సడన్ గా రోడ్డెక్కడంతో వార్తల్లో నిలబడమే కాదు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని గౌతమ్ ఎందుకు సడన్గా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు? తల్లిదండ్రులు లేకుండా బయటకు కూడా రాని గౌతమ్ ఎందుకు రోడ్డెక్కారు? ట్రోల్స్ ఎదుర్కోవడం వెనుక అసలు కారణం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


కారు నడుపుతూ రోడ్డెక్కిన గౌతమ్..

గౌతమ్ ఘట్టమనేని.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu ) తనయుడైన ఈయనకు మహేష్ అభిమానులలో మంచి ఫాలోయింగ్ ఉంది. హంబుల్ గా, సైలెంట్ గా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఏఎంబి మాల్ లో సందడి చేస్తూ ఉంటారు. తాజాగా మహేష్ ఫ్యాన్ ఒకరు గౌతమ్ వీడియోని షేర్ చేసి, వైరల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే .. గౌతమ్ ఘట్టమనేని కార్ డ్రైవింగ్ చేస్తూ వెళుతున్న వీడియోని షేర్ చేశారు. అభిమాని బైక్ మీద వెళ్తూ.. తన ఫోన్లో గౌతమ్ డ్రైవ్ చేస్తున్న వీడియోని క్యాప్చర్ చేస్తున్నారు. అది గమనించిన గౌతమ్..” ఏయ్.. ముందుకు చూడు” అని సైగ చేశాడు. దీన్ని సదరు అభిమాని వీడియో చేసి పోస్ట్ పెట్టాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ట్రోల్స్ ఎదుర్కొంటున్న గౌతమ్..

ఇకపోతే ఇక్కడ వీడియో వైరల్ అవ్వడానికి కారణం ఘట్టమనేని గౌతమ్ కారు నడపడం. ఇప్పుడే కారు ఇచ్చారేంటి? గౌతమ్ కి అసలు 18 ఏళ్లు నిండాయా? నిండితే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి గౌతమ్ కి 18 ఏళ్ళు నిండాయి.. వచ్చే ఆగష్టు 31కి 19 కూడా నిండుతాయి. మరి గౌతమ్ కి వాళ్ల నాన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాడో లేదో తెలీదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఒకే. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇలా రోడ్డు పైకి రావడం కరెక్ట్ కాదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది మహేష్ బాబు ప్రతి విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.అందుకే గౌతమ్ కి కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి ఉంటారు. అలా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టే ధైర్యంగా కొడుకుకి కారు ఇచ్చారు. లేదంటే మహేష్ అలాంటి పనులకు అంగీకరించరు.. ముఖ్యంగా రూల్స్ ఫాలో చేసే మహేష్ బాబు తన కొడుకు విషయంలో అలా ఎలా గాలికి వదిలేస్తారు అంటూ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికైతే గౌతమ్ ఘట్టమనేని కారుతో రోడ్డు మీదకెక్కడంతో ఇప్పుడు ఒక వర్గం నుండి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.

తండ్రికి తగ్గ తనయుడు..

అయితే ఈ వీడియోలో నెగటివ్ మాత్రమే కాదు పాజిటివ్ కూడా ఉంది అని మహేష్ బాబు అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. ఎందుకంటే తనను చూసిన అభిమానంలో బైకు నడుపుతూ ముందుకు చూడకుండా తననే వీడియో చేస్తూ వెళ్తున్న సదరు అభిమానికి.. గౌతమ్ జాగ్రత్తలు చెప్పడం చూసి మురిసిపోతున్నారు. ఇదీ మా మహేష్ బాబు కొడుకు అంటే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

also read:Akhil – Zainab: జైనాబ్ కట్నం కింద ఎంత తెచ్చిందో తెలిస్తే షాక్..డబ్బు, బంగారం విలువ ఎంతంటే?

త్వరలో ఇండస్ట్రీ ఎంట్రీ..

గౌతమ్ ఘట్టమనేని తండ్రి లాగా ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్కడ యాక్టింగ్ స్కూల్లో గౌతమ్ నటించిన వీడియోలను కూడా నమ్రత ఇన్స్టా లో షేర్ చేశారు. పాక్ అమ్మాయితో గౌతమ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా నిలిచింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×