Prabhas: టాలీవుడ్ స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రభాస్ చివరిగా కల్కి(Kalki) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే ప్రభాస్ మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన “ది రాజా సాబ్” (The Raja Saab)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
ట్రెండింగ్ లో రాజా సాబ్ టీజర్…
ఇక ఈ సినిమా నుంచి గత కొద్దిరోజులుగా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే విధంగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల(Teaser Release) చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వటమే కాకుండా యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ కైవసం చేసుకుని నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ చూసిన అభిమానులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వింటేజ్ లుక్స్…
గత కొద్ది రోజులుగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా మైథాలజీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే మొదటిసారి వింటేజ్ ప్రభాస్ ను ఈ సినిమా ద్వారా చూడబోతున్నామని ఆనందం అభిమానులలో ఉంది. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ నటించడమే కాకుండా, ప్రభాస్ లుక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇలా ప్రభాస్ చాలా కాలం తర్వాత మంచి కామెడీ, రొమాంటిక్ హర్రర్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రభాస్ కు నచ్చలేదా…
ఇకపోతే ఈ సినిమా టీజర్ గురించి ఇప్పటికే అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తుంది కానీ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. టీజర్ విడుదల చేసిన తర్వాత ఈ టీజర్ గురించి ఎంతోమంది మంచి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నప్పటికీ ప్రభాస్ మాత్రం ఎక్కడ టీజర్ గురించి స్పందించకపోవడం, అలాగే ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి కూడా ఈయన హాజరు కాకపోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టీజర్ విషయంలో ప్రభాస్ ఎక్కడో కాస్త అసంతృప్తికి గురి అవుతున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా విషయంలో ప్రభాస్ హ్యాపీగా లేరనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే మరి కొంతమంది అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి రాలేకపోతున్నారని ప్రభాస్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
Also Read: Actor Rare Photo: ఈ ఫొటోలో ఉన్నది ఓ స్టార్ హీరో తండ్రి.. మరి ఆ హీరో ఎవరో చెప్పగలరా?