Samantha..రీసెంట్ గా ఓ మ్యాగజిన్ కి ఇచ్చిన ఫోటోషూట్ లో సమంత(Samantha) గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే.. సమంత తన మెడ వెనుక భాగంలో ఉండే ఏమాయ చేసావే మూవీకి సంబంధించిన టాటూని తీసేసిందని,ఈ టాటూ తీసేయడంతో నాగచైతన్య (Naga Chaitanya) కు సంబంధించిన పూర్తి గుర్తులను చెరిపివేసింది అని అందరూ మాట్లాడుకున్నారు.కానీ తాజాగా ఈ ఫోటో చూస్తే మాత్రం సమంత చైతన్యని ఇంకా మర్చిపోలేదని అంటారు. మరి ఇంతకీ సమంతకి సంబంధించిన ఫోటోలో ఏముంది..? నాగచైతన్య (Naga Chaitanya) చివరి గుర్తు ఇంకా మిగిలే ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సమంత చైతూ గుర్తుని చెరపలేదా?
తాజాగా సమంతకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో సమంత మెడ వెనుక ఉన్న వైఎంసి(YMC) అనే టాటూ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇక ఈ టాటూ సమంత మెడ వెనుక భాగంలో ఉండడంతో సమంత టాటూ ని తీసేసుకుందని చాలామంది రూమర్లు స్ప్రెడ్ చేశారు. కానీ సమంత తన ఫస్ట్ మూవీకి సంబంధించిన టాటూనే తొలగించుకోలేదు. ఇంకా అలాగే ఉంది అని కామెంట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా సమంత ఓ మ్యాగజిన్ ఫోటోషూట్ లో పాల్గొన్న సమయంలో తన మెడ వెనుక భాగంలో ఉండాల్సిన వైఎంసి టాటూ కనిపించకపోవడంతో చాలామంది టాటూ తీసేసారు అనుకున్నారు. కానీ తాజా ఫోటో చూస్తే మాత్రం సమంత టాటూ తీసేయలేదని,మేకప్ తో కవర్ చేసుకుందని మాట్లాడుకుంటున్నారు.
ఇదిగో ప్రూఫ్.. వీడియో తో సహా..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా సమంత ముంబై(Mumbai)లోని బాంద్రా ఏరియాలో ఉండే ఒక జిమ్ నుండి బయటికి వచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఆ వీడియోలో సమంత తన కారు కోసం వెతుకులాడుతున్న సమయంలో కారు కనిపించకపోవడంతో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ..ఫోన్ మాట్లాడుకుంటూ కనిపించింది. ఆ సమయంలో కొంత మంది నెటిజన్లు సమంత వెంటపడుతూ వీడియోలు,ఫోటోలు తీశారు.
#Samantha post gym spotting pic.twitter.com/fiFrAhivZL
— $@M (@SAMTHEBESTEST_) June 17, 2025
సమంత మెడపై చెరగని చైతూ గుర్తు..
ఇక సమంతను వాళ్లు విసిగించడంతో ఆమె వారిపై కాస్త అసహనం వ్యక్తం చేసింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిన నేపథ్యంలో అదే వీడియోలో సమంత మెడ వెనక భాగంలో ఉన్న వైఎంసి టాటూ కనిపిస్తోంది.దీంతో సమంత నాగచైతన్య చివరి గుర్తుని ఇంకా చెరిపి వేయలేదని,చాలామంది సమంత నాగచైతన్యను ఇష్టపడే అభిమానులు కామెంట్ చేస్తున్నారు.ఇక సమంత నాగచైతన్య కాంబోలో వచ్చిన మొట్టమొదటి మూవీ ఏ మాయ చేసావే(Ye Maya Chesave)..ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు.అలా తమ సినీ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మాత్రమే కాదు వాళ్ళిద్దరినీ కలిపిన సినిమా కూడా ఇదే కావడంతో ఏమాయ చేసావే సినిమాకి సంబంధించి వైఎంసి అనే టాటూ ని తన మెడ వెనుక భాగంలో గుర్తుగా వేయించుకుంది సమంత.