E-Paper
Advertisement

Kalki 2898 Ad Movie: ‘కల్కి 2898 ఏడీ’ కోసం మహేశ్ బాబును కలిసిన దర్శకుడు.. ఇదిమామూలు ట్విస్ట్ కాదు భయ్యా!

Kalki 2898 Ad Movie: ‘కల్కి 2898 ఏడీ’ కోసం మహేశ్ బాబును కలిసిన దర్శకుడు.. ఇదిమామూలు ట్విస్ట్ కాదు భయ్యా!
Advertisement

Mahesh Babu For Kalki 2898 AD Movie(Telugu film news): ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పై ఫుల్ హైప్ ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపించనున్నాడు. దీంతో సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ప్రభాస్‌కి సంబంధించిన పోస్టర్లు చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. ఒక హాలీవుడ్ రేంజ్ హీరో ఎలా ఉంటాడో ఇందులో ప్రభాస్ అలా ఉన్నాడంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవతుందా?.. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని చూసేద్దామా అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

సలార్ మూవీతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన డార్లింగ్ ప్రభాస్.. కల్కి 2898 ఏడీ మూవీతో బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కల్కి మూవీలో భారీ తారాగణం కీలక పాత్ర పోషిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో భాగం అయ్యారు.

Also Read: ఐపీఎల్ కోసం ‘కల్కి’ నుంచి భైరవ.. ప్రభాస్ న్యూ లుక్ నెక్ట్స్ లెవెల్‌ అంతే..!

Advertisement

అంతేకాకుండా ఇందులో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరొక వార్త సినీ ప్రియుల్లో, అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ కీలకమైన పాత్ర కోసం పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే మహేశ్‌ను సంప్రదించినట్లు సమాచారం.

ఇక దీనికి సంబంధించి పూర్తి విషయానికొస్తే.. kalki 2898ad సినిమాలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడు. అందువల్ల ఇందులో ప్రభాస్‌ను ఆ పాత్రలో పరిచయం చేయడానికి బ్యాక్ గ్రౌండ్‌లో తన వాయిస్‌ను ఇవ్వాల్సిందిగా దర్శకుడు నాగ్ అశ్విన్.. మహేశ్ బాబును కోరినట్లు తెలుస్తోంది. మరి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు తన వాయిస్‌ను అందించిన మహేశ్.. ఇప్పుడు ప్రభాస్ కోసం తన వాయిస్‌ను ఇచ్చేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×