Big Stories

BC Reservations: బీసీ ఫ్యాక్టర్.. ఈసారైనా న్యాయం జరిగేనా?

TS Politics On BC Reservations(Telangana news today): రిజర్వేషన్లు.. సమాన అవకాశాలు కల్పించడానికి సరైన మార్గం. అలాంటి రిజర్వేషన్లలో కూడా వెనకబడి ఉన్నారు వెనకబడిన వర్గాల ప్రజలు.. యస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీల రిజర్వేషన్లపై బిగ్‌ డిబెట్ నడుస్తోంది. ఇప్పటికైనా సరైన న్యాయం చేయాలన్న డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి. మేధావులు, చరిత్రకారులు చెబుతున్నదేంటి.. 1850లోనే రిజర్వేషన్లు ఉన్నాయి.. పేర్లు లేవు కాని.. విషయం మాత్రం అదే.. సో అలాంటి రిజర్వేషన్ల అంశంపైనే ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్లపైనే అసలు చర్చ. ఎందుకంటే జనాభాలో సగానికి కంటే ఎక్కువ ఉన్నది బీసీలే.. కానీ వారికి ఇచ్చే కోటా మాత్రం 27 శాతం మాత్రమే.. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమవుతుంది..

- Advertisement -

లెటెస్ట్‌గా నీట్‌ ఎగ్జామ్‌ సమయంలో బీసీలు తమ గళాన్ని వినిపించారు. జనాభాలో సగానికిపైగా ఉన్ తమకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందనేది వారి ఆవేదన.. నీట్‌కు 27శాతం రిజర్వేషన్లు ఉన్న ఓబీసీ కోటాలో.. దాదాపు 11 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అదే 10 శాతం ఉన్న EWS కోటాలో లక్షా 88వేల మంది అప్లై చేశారు. అంటే ఓబీసీలు ఒక్క మెడికల్‌ సీటు కోసం 35 మంది పోటీ పడుతుంటే.. అగ్రవర్ణాల విద్యార్థులు ఒక్క సీటుకు పోటీ 17 మంది మాత్రమే ఉంటున్నారు. ఇలాంటి చర్యలతో బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడు వివాదం. నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీసీలు గుర్తొస్తారు అన్ని పార్టీలకి.. కాదంటే ఇప్పుడు మీరు చూడండి.

- Advertisement -

Also Read: నేడు వేములవాడ రాజన్నకు కోడెమొక్కులు చెల్లించనున్న ప్రధాని మోదీ

అన్ని పార్టీల నేతల నోళ్లపై నానుతుంది ఈ టాపిక్.. దీనికి రీజన్.. దేశ జనాభాలో ఆ వర్గాల ప్రజలే అధికం. బీసీల పేరు చెప్పుకొని లబ్ధి పొందుతున్న అన్ని పార్టీలు..బీసీల అభివృద్ధి కోసం, వాళ్ల జీవితాల కోసం చేస్తున్నది ఏమిటి? అన్ని పార్టీలను అధికారంలోకి తెచ్చిన ఘనత బీసీలదే.. కానీ బీసీలను వాడుకొని వదిలేసిన ఘనత కూడా ఆ పార్టీలదే.. బీసీలు ఆర్థికంగా లేకపోవడం వల్ల రాజకీయాల్లో రాణించలేక పోతున్నారు. ఇది హండ్రెడ్ పర్సెంట్‌ ఫ్యాక్ట్.. ఒక్క శాతం కూడా లేని వాళ్లు ఆర్థిక బలంతో ఈ దేశాన్ని ఏలుతుంటే.. అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ రిజర్వేషన్లు పొందుతుంటే.. దాదాపుగా 60 శాతం ఉన్న బీసీలు ఇంకా వెనకే ఉన్నారు. ఇది ఎవరిని కించపరచాలనే చేస్తున్న వ్యాఖ్యలు కాదు. హార్డ్ రియాల్టీ..

అందుకే ప్రస్తుతం కులగణన జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు బీసీ పెద్దలు, సామాజిక వేత్తలు, నిపుణులంతా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని వేల ఏళ్లుగా మన దేశంలో కుల వ్యవస్థలో దిగువ కులాలకూ, ఎగువ కులాలకూ మధ్య ఉన్న తీవ్ర అంతరాలను తొలగించేందుకు బ్రెయిన్ స్ట్రోమ్ చేస్తున్నారు. దీనికి సరైన సమాధానం కులగణనే అని చెబుతున్నారు. 1931లో బ్రిటీష్‌ పాలనలో చివరిసారి కులగణన నిర్వహించారు. 2011లో అప్పటి UPA ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కులగణన పేరిట సమాచారం సేకరించింది.

లెటెస్ట్‌గా బిహార్‌ కూడా క్యాస్ట్ సెన్సెస్‌ నిర్వహించింది. ప్రస్తుతం 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అటు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. దగాపడుతూ వస్తున్న బీసీలకు న్యాయం జరగాలన్నా.. ఇకనైనా అన్నింట్లో సమ ప్రాధాన్యం దక్కాలన్నా కులగణన జరగాలి.. ఏ సామాజిక వర్గంలో ఎంత మంది ఉన్నారో లెక్క తేలాలి. వారికి తగ్గట్టుగా రిజర్వేషన్లను పెంచాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News