BigTV English

Khaleja 4k : సామి శిఖరం… ఎవ్వరూ ఊహించలేరు… రీ రిలీజ్‌కు ఎన్ని స్క్రిన్స్ అంటే..?

Khaleja 4k : సామి శిఖరం… ఎవ్వరూ ఊహించలేరు… రీ రిలీజ్‌కు ఎన్ని స్క్రిన్స్ అంటే..?

Khaleja 4k : కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఎప్పటికీ అర్థం కాని పరిస్థితి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అయితే అలాంటి సినిమాలన్నిటికంటే ఒక మెట్టు పైన ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ఖలేజా సినిమా. అతడు వంటి క్లాసిక్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. అతడు సినిమాలో మహేష్ బాబు చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఈసారి మహేష్ బాబు కామెడీ టైమింగ్ బయటికి తీయాలి అనే ఉద్దేశంతో ఖలేజా సినిమాను డిజైన్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఈ సినిమా అప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఇప్పటికీ ఆ సినిమాకి మంచి స్టేటస్ ఉంది.


మోస్ట్ అవైటెడ్ రీ రిలీజ్

రీసెంట్ టైమ్స్ లో బాగా హిట్ అయిన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఇప్పటికే వర్షం, దేశముదురు, చత్రపతి, సూర్య సన్నాఫ్ కృష్ణన్, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. వీటిలో కొన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది. పవన్ కళ్యాణ్ తమ్ముడు, జల్సా సినిమాలకు కూడా మంచి రెవెన్యూ కూడా వచ్చింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఆ రికార్డును ఇప్పుడు ఖలేజా బ్రేక్ చేస్తుంది అని చెప్పాలి.


భారీ రీ రిలీజ్

రాష్ట్రవ్యాప్తంగా ఖలేజా సినిమాను దాదాపు 800 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన హడావిడి మొదలైంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం ఎనిమిది వందల థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయితే ఇప్పటివరకు రీ రిలీజ్ సినిమాల రికార్డ్స్ అన్నీ కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ అభిమానులకు కావలసిన అంశాలన్నీ కూడా ఉంటాయి. కామెడీ, యాక్షన్ తో పాటు త్రివిక్రమ్ దేవుడు అనే కాన్సెప్ట్ ను ఈ సినిమాతో చెప్పిన విధానం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు త్రివిక్రమ్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. చాలామంది త్రివిక్రమ్ కెరియర్ లో ఇదే బెస్ట్ రైటింగ్ అని కూడా చెబుతూ ఉంటారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఎంతటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.

Also Read : Pawan Kalyan: హరిహర వీరమల్లు ఫస్ట్ షో అక్కడే, ఆ ఫ్యాన్స్ అదృష్టవంతులు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×