Pawan Kalyan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటే మొదటి వినిపించే పేరు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే బీభత్సమైన హడావిడి ఉండేది. ఒక నెల రోజుల ముందు నుంచి ఆ సినిమా కోసం అభిమానులు పడిగాపులు కాస్తూ ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కు కూడా ఒకప్పుడు సినిమా మీద విపరీతమైన డెడికేషన్ ఉండేది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలపై పవన్ కళ్యాణ్ ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది అనేది వాస్తవం. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ త్రివిక్రమ్ చెప్పడంతో వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరట ఇచ్చింది.
రీ ఎంట్రీ జోరు
వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు సైన్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎప్పుడూ లేనంతగా దాదాపు ఐదారు సినిమాలను అనౌన్స్ చేశారు. అన్ని ప్రొడక్షన్ హౌస్ ల నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అయితే పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయిన భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలయ్యాయి. ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాయి అనేది వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆ మూడు సినిమాలు కూడా రీమేక్ సినిమాలు. వీటన్నిటికంటే ముందు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని చాలామంది ఊహించారు కానీ అది జరగలేదు.
రిలీజ్ కి సర్వం సిద్ధం
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెల 12న రిలీజ్ కి సిద్ధం అవుతుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ ఫిలిం కావడంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి మొదటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు. ఆ దర్శకత్వ బాధ్యతలను ప్రస్తుతం జై కృష్ణ తీసుకుని సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ జూన్ 12న రాత్రి 12 గంటలకి మొదట అమెరికాలో మొదలుకానున్నాయి. చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ కంటే మొదట యుఎస్ ఆడియన్స్ ఈ సినిమాను చూస్తారు. ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే వచ్చే వైబ్ ఈ సినిమాకి లేదు. ఒక సినిమా ఫలితం ఎలా ఉంటుందో జూన్ 12న తెలియనుంది.
Also Read : Manchu Manoj : ఎవడున్న లేకున్నా.. మనోజ్‌తో నేను ఉంటా… నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్