E-Paper
Advertisement

Mahesh new Range Rover : మహేశ్ కొత్త రేంజ్ రోవర్.. ధర ఎంతంటే..?

Mahesh new Range Rover : మహేశ్ కొత్త రేంజ్ రోవర్.. ధర ఎంతంటే..?
Advertisement
Mahesh new Range Rover

Mahesh new Range Rover : కొందరు నటీనటులకు లగ్జరీ కార్లు, ప్రవైట్ జెట్స్ అంటే ప్రత్యేకంగా ఇష్టం ఉంటుంది. అందుకే చాలామంది స్టార్ హీరోల దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇండియాలో ఎవరి దగ్గర లేని కారు కూడా తెలుగు స్టార్ హీరోల దగ్గర కనిపిస్తుంది. ఆ లిస్ట్‌లో మహేశ్ బాబు కూడా ఉంటారు. మహేశ్‌కు కూడా కార్లంటే చాలా ఇష్టం. తాజాగా ఆయన కార్ల కలెక్షన్‌లోకి ఒక కొత్త కారు వచ్చింది. హైదరాబాద్‌లో ఇలాంటి కార్‌ను సొంతం చేసుకున్న మొదటి వ్యక్తి మహేశే.

Advertisement

రేంజ్ రోవర్ కారు అనేది దాదాపు ప్రతీ తెలుగు స్టార్ హీరో దగ్గర ఉంది. కానీ మహేశ్ తనకోసం ప్రత్యేకంగా ఆ కారుకు గోల్ట్ కలర్ డిజైన్ చేయించుకున్నాడు. హైదరాబాద్‌లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఉన్న మొదటి వ్యక్తి మహేశే అని తెలుస్తోంది. ఈ కారు కాస్ట్ ఏకంగా రూ.5.4 కోట్లను టాక్ వినిపిస్తోంది. రేంజ్ రోవర్ అనేది చాలామందికి ఉన్నా.. గోల్డ్ కలర్‌లో ఉండడం వేరేవాటి నుండి దీనిని స్పెషల్‌గా చూపిస్తుంది.

మహేశ్ కొన్న ఈ కొత్త రేంజ్ రోవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, మోహన్‌లాల్, ఎన్‌టీఆర్ లాంటి హీరోల దగ్గర కూడా రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. ఇక ప్రొఫెషన్ విషయానికొస్తే.. మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో టాలీవుడ్‌లో అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్ల మధ్యలో మహేశ్ సినిమా సెట్స్‌లో అడుగు కూడా పెట్టాడు.

Advertisement

ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల.. ఇద్దరూ హీరోయిన్లుగా ఫైనల్ అవ్వగా.. ఇప్పుడు పూజా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పకుంది. తనంతట తానుగా తప్పుకుందా..? లేదా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా.? అనే విషయంలో టాలీవుడ్‌లో ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది. పూజా స్థానంలో ఎందరో ఇతర హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తుండగా.. అందులో ఏది నిజం అని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించే వరకు తెలియదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×