BigTV English

Balakrishna Akhanda 2: రిలీజ్ డేట్ లాక్.. పోస్టర్ తోనే గూస్ బంప్స్..!

Balakrishna Akhanda 2: రిలీజ్ డేట్ లాక్.. పోస్టర్ తోనే గూస్ బంప్స్..!

Balakrishna Akhanda 2: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్వర్గీయ నందమూరి తారకరామారావు(Sr.NTR)వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇండస్ట్రీలో ఈ ఏడాది 50 వసంతాలు పూర్తిచేసుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో వేగంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు కూడా సొంతం చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య ఇప్పుడు సినిమాలలో మళ్లీ బిజీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.


సీక్వెల్ కి సిద్ధమైన బాలయ్య..

ప్రస్తుతం బాలయ్య, ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2025 జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు ‘అఖండ -2’ కూడా ఉంటుందని గతంలోని ప్రకటించారు. 2021లో బోయపాటి శ్రీను(Boyapati Sreenu)దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘అఖండ’. ఊహించని విజయాన్ని అందుకుంది. అంతేకాదు బాలయ్య కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది. ఇందులో ద్విపాత్రాభినయం కూడా చేశారు బాలయ్య. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2021 డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతే కాదు ఈ సినిమా ద్వారానే హీరో శ్రీకాంత్(Srikanth) కూడా విలన్ గా తన ప్రతిభను చాటుకున్నారు. అంతేకాదు ఆయన విలనిజానికి ఉత్తమ ప్రతినాయకుడిగా సైమా అవార్డు కూడా లభించింది.


అఖండ -2 రిలీజ్ డేట్ లాక్..

ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ -2 రాబోతోంది. ‘డాకు మహారాజ్’ సినిమా షూటింగ్ రీసెంట్గా పూర్తి చేసిన బాలయ్య.. వెంటనే అఖండ సీక్వెల్ కోసం రంగంలోకి దిగినట్టు తెలిసింది. మరోవైపు బాలయ్య- బోయపాటి కాంబోకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరి కలయిక మరోసారి రిపీట్ అవుతుండడంతో బొమ్మ సూపర్ హిట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది అనగా 2025 సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ తో సహా ప్రకటించారు.

పోస్టర్ తోనే సినిమాపై హైప్..

ఈ పోస్టర్ విషయానికి వస్తే…చేతికి రుద్రాక్షలు ధరించి, రౌద్రంతో త్రిశూలం పట్టిన బాలకృష్ణ చేయిని రివీల్ చేశారు. ఈ పోస్టర్ చూస్తోంటే అందరిలో గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఈ పోస్టర్ తో యాక్షన్ స్టార్టెడ్ అంటూ చిత్ర బృందం తెలిపింది. పోస్టర్ తోనే హైప్ పెంచారంటూ.. ఇక ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కూతురు తేజస్విని(Tejaswini) 14 రీల్స్ ప్లస్ సంస్థ ద్వారా నిర్మిస్తోంది. గతంలో అఖండ నిర్మించిన రవీందర్ రెడ్డినే ఈ సీక్వెల్ కూడా నిర్మిస్తారని అనుకున్నారు. కానీ రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాదు బాలయ్య డేట్స్ ను వారు దక్కించుకొని ఈ సినిమా తీసేలా డీల్ చేసుకున్నారట. ముఖ్యంగా 14 ప్లస్ సంస్థ తేజస్విని ఆర్థిక విషయాల్లో సరైన రీతిలో చర్చించుకున్న తర్వాతనే అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నుండి టైటిల్, కంటెంట్ హక్కులు పొందినట్లు సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×