Google Searched Movies 2024 : ప్రతి ఏడాది డిసెంబర్ వచ్చిందంటే ఏడాదిలో ఏవి టాప్ లో ఉన్నాయనే లిస్ట్ వస్తుంది.. ఏడాదిలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు, వ్యక్తుల పేర్లు, వస్తువులు మొదలగు వాటి గురించి ఒక లిస్ట్ రావడం మనం గమనిస్తూనే ఉంటాము.. 2024 ఏడాదికి కూడా ఈ జాబితాలు ఒక్కొక్కటిగా వస్తుండగా.. తాజాగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ వచ్చేసింది.. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
2024 లో టాప్ సెర్చ్ లో ఉన్న సినిమాలు చూస్తే..
స్త్రీ2
కల్కి 2898 ఏడీ
12th ఫెయిల్
లాపతా లేడీస్
హనుమాన్
మహారాజా
మంజుమ్మెల్ బాయ్స్
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
సలార్
ఆవేశం
సినీ ప్రియులు ఎక్కువ మంచి సెర్చ్ చేసిన సినిమాల్లో 10 లో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమాలు రెండు ఉండటం విశేషం.. అలాగే మూడు హిందీ సినిమాలు ఉండగా, రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. ఒక మలయాళం ఉండటం విశేషం..
ప్రభాస్ కల్కి..
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి2898AD. ఈ ఏడాది రూ.1200 కోట్ల కలెక్షన్స్‌తో ‘కల్కి’ చిత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ఈ ఏడాది జూన్‌లో విడుదలై ట్రెమండెస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ ను అందుకోవడం విశేషం.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
హనుమాన్ మూవీ..
ఈ ఏడాది సంక్రాంతికి ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి.. సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. యంగ్ హీరోల్లో ఈ రేర్ ఫీట్ సాధించాడు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సలార్..
గత ఏడాది డిసెంబర్ చివర్లో విడుదలై బాక్సాఫీస్ వద్దు హ్యట్రిక్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ భారీ యాక్షన్ మూవీ సలార్.. ఈ ఏడాది కూడా గూగుల్ సెర్చ్ లో టాప్ 10లో నిలవడం గమనార్హం. ఇవే కాకుండా 2024లో పలు తెలుగు సినిమాలు వందకోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాయి.. బాహుబలి తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు ఈ మూవీ కమ్ ఇచ్చింది. ప్రస్తుతం వరుసగా నాలుగు ప్రాజెక్టులతో రాబోతున్నాడు. ఆ సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.
తెలుగు కన్నా టాప్ లో అలియాభట్ నటించిన మూవీ ఉండటం విశేషం.. హారర్ సినిమాగా వచ్చిన స్త్రీ 2 మూవీ టాప్ సెర్చ్ లో ఉంది..