E-Paper
Advertisement

Tiger Nageswara Rao: మేకింగ్ వీడియో అదుర్స్.. రవితేజ కొత్త మూవీపై మరింత పెరిగిన అంచనాలు..

Tiger Nageswara Rao: మేకింగ్ వీడియో అదుర్స్.. రవితేజ  కొత్త మూవీపై మరింత పెరిగిన అంచనాలు..
Advertisement

Tiger Nageswara Rao: రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సంబంధించి 365 రోజుల పాటు జరిగిన మూవీ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని వణికించిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ఈ వీడియో హైప్ ని పెంచుతుంది. మూవీని అద్భుతంగా చిత్రీకరించడంలో భారీ సెట్లు వేసి సమిష్టి కృషి చేసిన చిత్ర బృందం తపన ఈ వీడియోలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ మూవీలో భారీ విజువల్స్ తో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా.

సినిమా విడుదలకు ముందు కొన్ని వీడియోలు చూస్తే ఆ సినిమాపై ఓ రేంజ్ ఇంప్రెషన్ మనసులో ముద్ర పడిపోతుంది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు టీం విడుదల చేసిన వీడియో అలాంటి వాటిల్లో ఒకటి. మేకింగ్ వీడియో అనేకంటే కూడా.. రియల్ సినిమా వీడియో అని ఈ వీడియో గురించి అనుకోవచ్చు. మీకు తెలుసా టైగర్ నాగేశ్వరరావు మూవీ అనేది డైరెక్టర్ వంశీ ఐదేళ్లుగా కంటున్న కల. ఇన్ని రోజుల తర్వాత ఎట్టకేలకు కార్యరూపం దాల్చిన ఆ కల మరొక నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదలవుతుంది.

Advertisement

ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్ గా లాంచ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం మేకింగ్ వీడియోలో డైరెక్టర్ పాట్లు ..అగచాట్లు.. ఆర్టిస్టులతో సన్నివేశాన్ని సరిగ్గా వచ్చేలా చేయడానికి పడ్డ కష్టాలు చూస్తూ ఉంటే నిజంగా ఓ హాట్సాఫ్ చెప్పాలి అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా థియేటర్లో కూర్చొని స్క్రీన్ పై వచ్చే సన్నివేశాలని చూసి ఓస్ ..ఇంతేనా.. ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అని దర్శక పర్యవేక్షణ ఇస్తారు చూడండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. అప్పుడే వాళ్ళకి ఒక సీన్ తీయడానికి ఎంత మంది ఎంత కష్టపడతారు అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ సినిమాలో కంటెంట్ ని లైవ్లీగా చూపించడం కోసం వంశీ ఎన్నో రిస్కులు తీసుకున్నారు అన్న విషయం ఈ వీడియో చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ మూవీ కోసం ఇండోర్ సెట్లో కొలను ఏర్పాటు చేసి.. అందులో కొన్ని పదుల సంఖ్యలో బోట్ల‌ను పెట్టి విజువల్స్ తో సన్నివేశాన్ని నిర్మించిన తీరు గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఎడిటింగ్ కి ముందే మేకింగ్ వీడియోలో సీన్స్ ఇలా ఉంటే మరి ఆన్ స్క్రీన్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోండి. ముఖ్యంగా మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వరరావు లో తన కెరియర్ బెస్ట్ యాక్షన్ సీన్స్ చేశాడు.అనుప‌మ్ ఖేర్ పాత్ర‌ కు మంచి ఇంటెన్సిటీ ఇచ్చారు అనేది ఈ విజువల్స్ లో అర్థమవుతుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ,మేకింగ్ వీడియోస్ మూవీ పై మంచి పాజిటివ్ బజ్ సృష్టించాయి. ఈ ఎఫెక్ట్స్ అన్ని చూస్తుంటే ఇక నాలుగు రోజుల్లో విడుదలయ్యే చిత్రం బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడం కన్ఫామ్ అనిపిస్తుంది. మరి రిజల్ట్ ఎలా ఉంది అనేది తెలియాలి అంటే విడుదల వరకు వెయిట్ చేయాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×