BigTV English

Malaika Arora Father: మలైక అరోరా తండ్రి ఆత్మహత్య, 6వ అంతస్తుపై నుంచి దూకి.. కారణం ఇదేనా?

Malaika Arora Father: మలైక అరోరా తండ్రి ఆత్మహత్య, 6వ అంతస్తుపై నుంచి దూకి.. కారణం ఇదేనా?

Malaika Arora Father Suicide: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా సూసైడ్ చేసుకున్నారనే వార్త బాలీవుడ్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. తాను నివసిస్తున్న బిల్డింగ్ ఆరో ఫ్లోర్ నుండి అనిల్ దూకి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం బాలీవుడ్ మీడియా ద్వారా బయటికొచ్చింది. దీంతో వెంటనే బాండ్రా పోలీస్‌తో పాటు క్రైమ్ బ్రాంచ్ టీమ్ కూడా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు పోలీసులకు సూసైడ్ నోట్ లాంటిది ఏమీ లభించలేదు. అంతే కాకుండా అసలు అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలు కూడా బయటికి రాలేదు. కానీ బీ టౌన్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అనిల్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం.


చిన్న వయసులోనే

మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా, తల్లి జాయ్స్ పాలికార్ప్.. తన చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం మలైకా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన చిన్నతనం గురించి స్వయంగా బయటపెట్టింది. తను చిన్నతనంలో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండేదాన్ని అని.. కానీ తల్లిదండ్రుల విడాకుల తర్వాత అంతా మారిపోయిందని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తన వయసు కేవలం 11 ఏళ్లే అని, తన చెల్లి అమృత వయసు ఆరేళ్లు అని గుర్తుచేసుకుంది. తల్లిదండ్రుల విడాకుల తర్వాత మలైకాతో పాటు తన చెల్లి అమృత కూడా తల్లి జాయ్స్‌తో కలిసి ఉండడం మొదలుపెట్టారు.


Also Read: నాకు చెప్పకుండానే విడాకులు.. స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్

జీవితం అల్లకల్లోలం

అనిల్ అరోరా, జాయ్స్ కలిసున్నప్పుడు వారు థానేలో ఉండేవారు. విడాకుల తర్వాత మలైకా, అమృతను తీసుకొని చెంబూర్‌కు షిప్ట్ అయిపోయారు జాయ్స్. ‘‘నా చిన్నతనం చాలా అద్భుతంగా ఉండేది. కానీ అదంతా ఈజీగా గడిచిపోలేదు. దాని గురించి ఒక్క మాటలో వివరించాలంటే అల్లకల్లోలం అని చెప్తాను. కానీ కష్టమైన రోజులే మనకు ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తాయి. నా తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత మా అమ్మను నేను కొత్తగా చూడడం మొదలుపెట్టాను. స్వాతంత్ర్యంగా ఉండడం కోసం ఎంత కష్టపడాలో తెలుసుకున్నాను. ఆ రోజులే నేను ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలా ఉండాలో నేర్పించాయి. నేను ఇప్పటికీ స్వాతంత్ర్యంగా నచ్చినట్టుగా జీవిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది మలైకా అరోరా.

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ విషయాల వల్ల తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మలైకా. చాలా ఏళ్లు కలిసున్న తర్వాత తనకు విడాకులు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. విడాకుల తర్వాత చాలాకాలం సింగిల్‌గా ఉన్న మలైకా.. కపూర్ ఫ్యామిలీ వారసుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. వీరిద్దరూ.. తమ రిలేషన్ గురించి సీక్రెట్‌గా ఉంచకుండా ఓపెన్‌గా ఒప్పుకున్నారు. అలా అయిదేళ్లు డేటింగ్ తర్వాత అర్జున్ కపూర్‌కు ఇటీవల బ్రేకప్ చెప్పింది మలైకా అరోరా. ఇలాంటి సమయంలోనే తన తండ్రిని కోల్పోవడం బాధాకరమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×