Malaika Arora:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా(Malaika Arora)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇటీవల ఆమె తండ్రి మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్(Arbaaz Khan) , బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్(Arjun Kapoor)ల వల్లే ఈమె వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు. ఈమె తండ్రి మరణం తరువాత.. ఇద్దరూ కూడా ఒకేసారి ఈమెను పరామర్శించడానికి రావడంతో ఈ విషయం కాస్త గత నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇదిలా ఉండగా తన భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత 2018 లో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేయడం మొదలుపెట్టింది మలైకా. ఇక దాంతో పుకార్లు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించడంతో తమ రిలేషన్ పై ఇద్దరు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.
బ్రేకప్ తో షాక్ ఇచ్చిన జంట..
ఇక దీంతో పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకోగా.. అనూహ్యంగా అర్జున్ కపూర్ దివాళి బాష్ లో చేసిన కామెంట్స్ అందరిలో అనుమానాలకు దారితీసాయి. కార్యక్రమంలో భాగంగా అర్జున్ కపూర్ తో కొంతమంది మలైకా అరోరా గురించి ప్రశ్నించారు. దీంతో తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు అర్జున్ కపూర్. ఇక మొత్తానికి అయితే అర్జున్ కపూర్ కామెంట్స్ వల్ల ఇద్దరు విడిపోయినట్లు వార్తలు వినిపించాయి.. ఇక ఇతడి మాటలు విన్న మలైకా అరోరా కూడా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. “మన హృదయాన్ని ఒక్క సెకండ్ తాకడం వల్ల జీవితాంతం మన ఆత్మను మనం తాకవచ్చు” అంటూ తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ..
వారి ప్రేమలో బిజీగా ఉన్నా..
ఇదిలా ఉండగా అర్జున్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత తాజాగా ఈమె చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ” మనల్ని కాదనుకొని వెళ్లిపోయిన వారి కోసం ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నన్ను ప్రేమించే వారిని ప్రేమించడంలో నేను చాలా బిజీగా ఉన్నాను.. అందుకే నన్ను ఇష్టపడే వారితో మళ్లీ ప్రేమలో పడ్డాను”..
అంటూ ఒక ఫోటోని పంచుకుంది మలైకా. ఈ ఫోటో చూసిన అభిమానులు ఈమె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.
మలైకా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..
ఇకపోతే భర్త నుండి విడిపోయిన తర్వాత.. కనీసం బాయ్ ఫ్రెండ్ తో నైనా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది అనుకునే లోపే, అర్జున్ కపూర్ సడన్ గా బ్రేకప్ చెప్పి ఆమెను మరింత ఒంటరిని చేశారు.. సాధారణంగా ఏ ఒక్క అమ్మాయి అయినా సరే జీవితంలో ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంతగా మానసిక క్షోభ అనుభవిస్తుందో అందరికీ తెలుసు. కానీ మలైక అరోరా మాత్రం తనను కాదనుకొని వెళ్లిపోయిన వారికోసం ఆలోచించకుండా తనను కావాలనుకుంటున్న వారి కోసం ఒక అడుగు ముందుకేయడం నిజంగా హాట్స్ ఆఫ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మలైక నిర్ణయానికి ఎవరైనా సరే ప్రశంసలు కురిపించాల్సిందే.
మలైకా అరోరా వ్యక్తిగత జీవితం..
ఇకపోతే సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ 1998లో వివాహం చేసుకోగా.. మనస్పర్ధలు వల్ల 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది అర్జున్ కపూర్ తో డేటింగ్ మొదలుపెట్టిన ఈమె, ఇప్పుడు అతడికి కూడా దూరమైనట్లు తెలుస్తోంది.