BigTV English

Ajmer Dargah Temple: అజ్మేర్ దర్గాలో శివాలయం?.. దర్గా కమిటీ, ప్రభుత్వానికి కోర్టు నోటీసులు

Ajmer Dargah Temple: అజ్మేర్ దర్గాలో శివాలయం?.. దర్గా కమిటీ, ప్రభుత్వానికి కోర్టు నోటీసులు

Ajmer Dargah Temple| ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మసీదులు, దర్గాలలో పురాతన హిందూ దేవాలయాలున్నాయని పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన రాజస్థాన్ అజ్మేర్ దర్గా.. (సూఫీ సంత హజ్రత్ నిజాముద్దీన్ చిష్తీ దర్గా)లో కూడా మహాశివుని ఆలయం ఉందంటూ సెప్టెంబర్ 2024లో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు బుధవారం నవంబర్ 27, 2024న ఈ పిటీషన్ విచారణ ప్రారంభించింది. అయితే పిటీషనర్ తరపు న్యాయవాది దర్గాలోపల హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోర్టుని కోరారు. దీంతో కోర్టు అజ్మేర్ దర్గా కమిటీ, మైనారిటీ మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు సర్వే శాఖకు నోటీసులు జారీ చేసింది.


ఇప్పటికే దేశంలోని వారణాసి, మథురా, మధ్యప్రదేశ్ ధార్ నగరంలోని ధార్ ప్రాంతాలలో మసీదులు వివాదాస్పదంగా మారాయి. కొన్ని రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ ప్రాంతంలో మసీదులో పురావస్తు శాఖ సర్వే చేస్తుండగా.. దాడులు జరిగి నలుగురు చనిపోయారు. సంభల్ ప్రాంతంలో పురాతన దేవాలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని పిటీషన్ వేయగా.. స్థానిక కోర్టు సర్వే చేయాలని పురావస్తు శాఖను ఆదేశించింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో అజ్మేర్ దర్గా కేసు విచారణ ప్రారంభం కావడం గమనార్హం.

Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్


అజ్మేర్ దర్గాలో శివాలయం ఉన్నట్లు ఆధారాలున్నాయని అజ్మేర్ కోర్టులో హిందూ సేన నాయకుడు విష్ణు గుప్తా పిటీషన్ దాఖలు చేశాడు. “దర్గాను ఇకపై సంకట్ మోచన్ మహాదేవ్ దేవాలయంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ దర్గాకు ఎటువంటి గుర్తింపు, రిజిస్ట్రేషన్లు ఉన్నా.. దాన్ని రద్దు చేయాలి. ఆ దర్గాలో పురావస్తు శాఖ సర్వే చేయాలి. హిందువులకు లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసేందుకు అన్ని అధికారాలున్నాయి.” అని విష్ణు గుప్తా అన్నారు.

ఈ కేసుని అజ్మేర్ కోర్టులో వాదిస్తున్న అడ్వకేట్ యోగేష్ సిరోజా మాట్లాడుతూ.. “మాజీ న్యాయమూర్తి హర్విలాస్ శారద 1911లో రాసిన పుస్తకం ప్రకారం.. అజ్మేర్ దర్గా ద్వారమైన బులంద్ దర్వాజాపై హిందు సంప్రదాయాలకు చెందిన పురాతన భాషలో రాతలున్నాయి. ఆ ఐకానోగ్రఫీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పుస్తకం ప్రకరాం.. దర్గా నిర్మాణానికి ముందు ఆ ప్రదేశంలో శివాలయం ఉండేది. ఆ ఆలయాన్ని కూల్చేసి.. దర్గా నిర్మాణంలో ఆలయ శిథిలాలను ఉపయోగించారు. పైగా దర్గాలోపల నిజాముద్దీన్ స్వాములవారి సమాధి ఉన్న ప్రదేశంలో ఒక జైనుల గుడి కూడా ఉన్నట్లు అరోపణలున్నాయి.” అని అన్నారు.

మరోవైపు ఈ ఆరోపణలను అజ్మేర్ దర్గా కమిటీ ఖండించింది. దర్గా కమిటీ సెక్రటరీ అంజుమన్ సయ్యద్ జడ్గాన్ మాట్లాడుతూ.. “ఈ దర్గా ఒక్క ముస్లింలది మాత్రమే కాదు. ఇక్కడ వచ్చే భక్తుల్లో హిందువులు కూడా ఉన్నారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి  ఈ దర్గా ప్రతీక. హజ్రత్ నిజాముద్దీన్ చిష్తీ భక్తులు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. దేశంలోనే కాకుండా ఆఫ్ఝనిస్తాన్ నుంచి ఇండోనేషియా వరకు నిజాముద్దీన్ స్వామి భక్తులున్నారు. ఇటువంటి కేసులు వలన దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టినట్ల అవుతుంది. దేశంలో వివిధ మతాల ప్రజల ఐకమత్యానికి ఇది వ్యతిరేకం. కోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. ఏం జరుగుతుందో చూడాలి. కాశి, మథురాలలో కూడా పురాతన మసీదులకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు జరుగుతన్నాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు.” అని ఆయన అన్నారు.

రాజస్థాన్ అజ్మేర్ కోర్టు సివిల్ జడ్జి మన్మోహన్ చండేల్ నోటీసులు జారీ చేసిన తరువాత డిసెంబర్ 20, 2024న కేసు విచారణను వాయిదా వేశారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×