BigTV English

Sanjiv Goenka: డేంజర్ లో పంత్ కెరీర్.. ధోని, కేఎల్ రాహుల్ కు పట్టిన గతే..?

Sanjiv Goenka: డేంజర్ లో పంత్ కెరీర్.. ధోని, కేఎల్ రాహుల్ కు పట్టిన గతే..?

 


 

Sanjiv Goenka – Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు ( IPL 2025) సంబంధించిన మెగా వేలం ఇటీవల ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మెగా వేలంలో.. చాలామంది క్రికెటర్ల పై కోట్ల వర్షం కురిసింది. ఈ మెగా వేలంలో టీమిండియా కు చెందిన ప్లేయర్లు ఎక్కువగా… ధర పలకడం జరిగింది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh Pant), శ్రేయస్ అయ్యర్, కెల్ రాహుల్ (KL Rahul ), వెంకటేష్ అయ్యర్, అర్షదీప్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది.


అయితే ఇక్కడ… స్పెషల్ గా రిషబ్ పంత్ గురించి మాట్లాడుకోవాలి. మొన్నటి వరకు ఢిల్లీ కెప్టెన్ గా రిషబ్ పంత్ కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో రిషబ్ బందుకు గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అందుకే రికీ పాంటింగ్ తో పాటు రిషబ్ పంత్ బయటికి వచ్చారట. ఈ తరుణంలోనే రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ కి వెళ్లగా రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెంట్స్ కొనుగోలు చేసింది.

ఇక ఈ మెగా వేలంలో రిషబ్ పంతును పోటీపడి కొనుగోలు చేసింది లక్నో. 21 కోట్ల వరకు హైదరాబాద్ జట్టు అలాగే, లక్నో పోటీపడ్డాయి. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం కార్డు ప్రయోగించింది. అయితే… లక్నో 27 కోట్లు ఆఫర్ ఇవ్వడంతో… రిషబ్ పంత్ ను వదిలేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో త్వరలోనే లక్నో కెప్టెన్గా రిషబ్ పంత్ కాబోతున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గొయంకా ( Sanjiv Goenka ) ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఆయన ఏ జట్టును కొనుగోలు చేసిన… ఆ జట్ల కెప్టెన్లతో గొడవలు పెట్టుకుంటున్న రికార్డులు ఉన్నాయి. రైజింగ్ పూనే సూపర్ జెంట్స్ ఓనర్ గా సంజీవ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ పైన రెండు సంవత్సరాలు బ్యాన్ విధించడంతో.. 2016 అలాగే 2017లో రైసింగ్ పూణే సూపర్ జెంట్స్ రూపంలో కొత్త జట్టు తెరపైకి వచ్చింది. అయితే అప్పుడు మహేంద్రసింగ్ ధోనీని ( Ms Dhoni) కొనుగోలు చేసింది రైజింగ్ పూణే సూపర్ జెంట్స్.

అయితే రెండు సీజన్స్ లో ఆ జట్టు విఫలమైంది. అయితే.. అదే సమయంలో మహేంద్ర ధోనీకి ఉన్న కెప్టెన్సీ ని తీసివేసి స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ చేశాడు సంజీవ్. దీంతో అప్పుడు మహేంద్రసింగ్ ధోని కి గోర అవమానం జరిగిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత లక్నో సూపర్ జెంట్స్ జట్టును సంజీవ్ గుణింకా కొనుగోలు చేయడం జరిగింది. దీంతో వికెట్ కీపర్ అయినా కేఎల్ రాహుల్ ను కేప్టెన్ చేశాడు సంజీవ్. మొదటి సంవత్సరం బాగానే ఉన్నా మొన్న 2023 సీజన్లో కేల్ రాహుల్ తో గొడవ పెట్టుకున్నాడు లక్నో ఓనర్ సంజీవ్.

హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రౌండ్ లోనే సంజీవ్ అలాగే కేఎల్ రాహుల్ మధ్య… సంభాషణ ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. దీంతో ఈసారి కేఎల్ రాహుల్ లక్నో ను వదిలి బయటకు వచ్చాడు. దీంతో రిషబ్ పంతును 27 కోట్లకు కొన్నాడు లక్నో ఓనర్ సంజీవ్. ఇలాంటి నేపథ్యంలో త్వరలోనే… మహేంద్ర సింగ్ ధోని అలాగే కేఎల్ రాహుల్ కు పట్టిన గతే రిషబ్ పంత్ కు పట్టబోతుందని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. లక్నో ఓనర్ సంజీవ్ ను ఉద్దేశించి మండిపడుతున్నారు.

Also Read: Sachin Tendulkar: కొడుకు కోసం సచిన్ అలా చేశాడా? సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×