Apple iPhone 16| స్మార్ట్ ఫోన్ లలో యాపిల్ ఐఫోన్ కు ఓ ప్రత్యేకత ఉంది. సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్ ని ఇష్టపడే స్మార్ట్ ఫోన్ అభిమానులు ఐఫోన్ కోరుకుంటారు. అయితే తాజాగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ఫోన్ ఇండియాలో లభిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 13 సాయంత్రం నుంచి ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ప్రీ ఆర్డర్స్ (అడ్వాన్స్ బుకింగ్) మొదలుపెట్టేసింది. సెప్టెంబర్ 20 నుంచి ఈ ఫోన్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి.
అయితే అందరూ ఈ సారి ఐఫోన్ 16 మోడల్స్ రేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ కంపెనీ మాత్రం టాప్ మాడల్స్ అయిన ప్రో సిరీస్ రేటు మాత్రం పెద్దగా మార్చలేదు. ఊహించిన దాని కంటే తక్కువ రేటులోనే అందుబాటులోకి రానున్నాయి.
ఐఫోన్ 16 ప్రీ ఆర్డర్ ఆఫర్స్ ఇవే..
– ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ చేసుకునే కస్టమర్లు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తే.. ఇన్‌స్టెంట్ గా రూ.5000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తోంది.
– పైగా ఐఫోన్ 16 సిరీస్ మూడు నెలలు, ఆరు నెలల నో కాస్ట్, నో ఇంట్రస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి.
– పాత ఐఫోన్ మోడల్ ఫోన్లు ఎక్స్‌ఛేంజ్ పై కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ.67500 దాకా తక్కువ ధరకు ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు లభిస్తాయి.
– ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ కొనుగోలు చేస్తే యాపిల్ మ్యూజిక్, యాపిల్ టివి ప్లస్, యాపిల్ ఆర్కేడ్ లలో మూడు నెలల ఉచిత సబ్సిక్రిప్షన్ కూడా లభిస్తుంది.
Also Read: స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో రూ.999కే మొబైల్ ఫోన్.. UPI పేమెంట్స్ కూడా చేయొచ్చు
భారతదేశంలో ఐఫోన్ 16 సిరీస్ ధరలు ఎలా ఉన్నాయంటే..
ఐఫోన్ 16 ధర
128GB స్టోరేజ్: రూ.79,900
256GB స్టోరేజ్: రూ.89,900
512GB స్టోరేజ్: రూ.1,09,900
ఐఫోన్ 16 ప్లస్ ధర
128GB స్టోరేజ్: రూ.89,900
256GB స్టోరేజ్: రూ.99,900
512GB స్టోరేజ్: రూ.1,19,900
iPhone 16 Pro ధర
128GB స్టోరేజ్: రూ.1,19,900
256GB స్టోరేజ్: రూ.1,29,900
512GB స్టోరేజ్: రూ.1,49,900
1TB స్టోరేజ్: రూ.1,69,900
iPhone 16 Pro Max ధర
256GB స్టోరేజ్: రూ.1,44,900
512GB స్టోరేజ్: రూ.1,64,900
1TB స్టోరేజ్: రూ.1,84,900
పాత ఐఫోన్ మోడల్స్ పై కూడా ఆఫర్స్ ఉన్నాయి..
యాపిల్ కంపెనీ.. iPhone 15, iPhone 14 ధర రూ.10,000 తగ్గించింది. అలాగే iPhone 15 Pro, Pro Max మోడల్స్ విక్రయాలు పూర్తిగా నిలిపివేసింది.
కంపెనీ iPhone 15 మరియు iPhone 15 Plusపై రూ.4,000, iPhone 14, iPhone 14 Plusపై రూ.3,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
iPhone SE మోడల్ కొనుగోలుపై కూడా రూ.2,500 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.
ఈ ఆఫర్‌లన్నీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ మరియు ICICI బ్యాంక్ కార్డ్స ద్వారా పేమెంట్ చేసే కస్టమర్లకు వర్తిస్తాయి.