E-Paper
Advertisement

Malavika Mohanan : రాజాసాబ్ కంటే ముందే ప్రభాస్ తో ఛాన్స్ వచ్చింది

Malavika Mohanan : రాజాసాబ్ కంటే ముందే ప్రభాస్ తో ఛాన్స్ వచ్చింది
Advertisement

Malavika Mohanan : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను చూపించబోతున్నాడు ప్రభాస్. దర్శకుడు మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి సినిమాల్లో ఉన్న ప్లస్ పాయింట్ కామెడీ. ఈ రోజుల్లో సినిమా నుంచి మొదలుపెడితే మారుతి దర్శకత్వంలో చివరగా వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా వరకు కామెడీ కి పెద్ద స్కోప్ ఉంటుంది. ఇక మారుతి విషయానికొస్తే ఇప్పటివరకు మారుతి కెరియర్ లో ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ నేను ప్రభాస్ తో సినిమా చేస్తే బుజ్జిగాడు, డార్లింగ్ కైండ్ ఆఫ్ సినిమాను చేస్తాను అని ఇదివరకే అనౌన్స్ చేశాడు. చెప్పిన మాదిరిగానే హర్రర్ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలిసిందే కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం ప్రొడక్షన్ హౌస్ నుంచి రాలేదు. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. కల్కి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెడతామని అప్పట్లో నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా మాళవిక మోహన్ కూడా ఈ సినిమా షూటింగ్ అయిపోయినట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక ఫంక్షన్ లో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పుకొచ్చింది. నేను చేస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నా ఫేవరెట్ హీరోస్ లో ప్రభాస్ ఒకరు అంటూ తెలిపింది. మాస్టర్ సినిమా అయిపోయిన తర్వాత సలార్ సినిమా కోసం మాళవికాకు ఫోన్ వచ్చింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో మాళవికకు వర్కౌట్ కాలేదు. కానీ ఆ ప్రాజెక్టు తప్పిపోయిన కొన్ని రోజుల తర్వాత రాజా సాబ్ నుంచి కాల్ వచ్చి సెలెక్ట్ అయింది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది మాళవిక.

Advertisement

మాళవిక మోహనన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో డెబ్యూ ఫిలిం చేయకపోయినా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమాలో నటించింది. లోకేష్ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి చూస్తారు. కాబట్టి ఆ విధంగా మాళవిక మోహనన్ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఇక మలయాళం లో తెరకెక్కిన క్రిస్టి సినిమాలో నటించింది మాళవిక. ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. చాలామంది ఓటీటీ లో ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ సినిమాలో కూడా నటించింది మాళవిక. ఇక ప్రస్తుతం సర్దార్ 2 లో నటిస్తోంది. రాజా సాబ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read : Thandel Movie : టికెట్ ధరలు పెంచండి… ప్రభుత్వానికి అల్లు అరవింద్ లేఖ

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×