BigTV English

Thandel Movie : టికెట్ ధరలు పెంచండి… ప్రభుత్వానికి అల్లు అరవింద్ లేఖ

Thandel Movie : టికెట్ ధరలు పెంచండి… ప్రభుత్వానికి అల్లు అరవింద్ లేఖ
Advertisement

Thandel Movie: నాగచైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన చందు, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు నాగచైతన్య హీరోగా మరో పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేసాడు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం బుజ్జి తల్లి అని ఒక పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.


ఈ సినిమాను ఒక యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని తీసిన విషయం తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా టీజర్ కూడా మంచి అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఈ టీజర్ లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇదివరకే సాయి పల్లవి, నాగచైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు మంచి ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి. మళ్లీ వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో కనిపిస్తుండడంతో చాలామందికి ఈ సినిమా మీద క్యూరియాసిటీ మరింత ఎక్కువైంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసను మాట్లాడబోతున్నాడు. చైతు మొదటిసారి ఇటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వర్కౌట్ అయితే చైతు కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది.

Also Read: తన తండ్రి సినిమాలకు డబ్బింగ్ చెప్పిన నటుడు


ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి సందీప్ రెడ్డివంగా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ఏపీలో ఈ సినిమా టికెట్ హైక్ కోసం అప్లై చేశారు. దాదాపు 50 రూపాయల వరకు టికెట్ రేట్ పెంచుకునేటట్లు అప్లై చేశారు చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన జీవో కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో నార్మల్ రేట్స్ ఉండనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. హైక్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి జీవో పాస్ చేస్తుందో వేచి చూడాలి.

Also Read :  హార్డ్‌ డిస్క్‌లో 300ల న్యూ*డ్ వీడియోలు… మస్తాన్‌ సాయి బండారాన్ని బయట పెట్టిన లావణ్య

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×