Mastan Sai :రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య (Lavanya) కేసులో మస్తాన్ సాయి (Mastan Sai) కీలకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మస్తాన్ సాయిపై లావణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఇప్పుడు మళ్లీ 300 మంది అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీసి ప్రేమ, పెళ్లి పేరుతో వారిని లోబరుచుకున్నట్లు లావణ్య వెల్లడించింది. ముఖ్యంగా బెడ్ రూమ్లో కెమెరాలు పెట్టి, శృంగార దృశ్యాలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి.. అమ్మాయిలతో నగ్నంగా చేసిన వీడియో కాల్స్ ను రికార్డు చేశారట. అంతేకాదు వీటన్నింటినీ తన హార్డ్ డిస్క్లో మస్తాన్ సాయి రికార్డ్ చే చేసినట్లు లావణ్య ఆరోపించింది.
లావణ్య పై అత్యాచారం చేసిన మస్తాన్ సాయి..
అయితే లావణ్యను అత్యాచారం చేసిన మస్తాన్ సాయి , ఆ వీడియోలను కూడా రికార్డు చేశారట. దాంతో తన వీడియోలను డిలీట్ చేయాలి అని లావణ్య అడిగినా.. ఆమెపై దాడి కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె మస్తాన్ సాయి గుట్టు మొత్తం బట్టబయలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ కి అమ్మాయిలను బానిసలను చేసి, వారిని లోబరుచుకున్న మస్తాన్ సాయి.. వారితో నగ్నంగా వీడియోలు తీసి 4 టీబీ హార్డ్ డిస్క్ లో రికార్డు చేశారట. దాదాపు 300 మంది అమ్మాయిల జీవితాలు.. ఆ వీడియోలను పోర్న్ వెబ్సైట్లో పెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేయడంతో.. ఆ భయంతో ఆ వీడియో కాల్స్ వ్యవహారాన్ని ఇంతవరకు బాధిత యువతులు ఎవరూ కూడా బయట పెట్టలేదని లావణ్య తెలిపింది.
నిఖిల్ ఫోన్ హ్యాక్ చేసిన మస్తాన్ సాయి..
ఇకపోతే తన వీడియోల కోసం మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ను తీసుకొచ్చిన లావణ్య, తన వీడియోల కోసం వెతుకుతూ ఉండగా మిగిలిన అమ్మాయిల వీడియోలు కూడా బయటపడినట్లు ఆమె గుర్తించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఆ హర్డ్ డిస్క్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్(Nikhil ) ఫోన్లను హ్యాక్ చేసి వారి ప్రైవేటు వీడియోలను కూడా హార్డ్ డిస్క్లో ఉంచిన విషయాన్ని కూడా ఆమె గుర్తించింది.
హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసిన లావణ్య..
ఇకపోతే లావణ్య తీసుకున్న హార్డ్ డిస్క్ వెనక్కి ఇవ్వాలంటూ లావణ్య పై దాడి చేశారట మస్తాన్. హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు ఆమెను చంపే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తనతోపాటు వందలాది మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలని లావణ్య పోలీసులను కోరింది. అంతేకాదు 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు కూడా అప్పగించింది లావణ్య. దీంతో పోలీసులు మస్తాన్ స్థాయిని అదుపులోకి తీసుకున్నారు.
రాజ్ తరుణ్ హస్తం ఉందా..?
ఇకపోతే మస్తాన్ సాయిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లే సమయంలో కూడా లావణ్యను బెదిరించాడట. దాంతో నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని లావణ్య అనగా.. మస్తాన్ సాయి మాత్రం తనకు తన ఫోన్, హార్డ్ డిస్క్ ఇస్తేనే ఇంట్లో నుంచి వెళ్తానని మస్తాన్ సాయి ఆమెతో గొడవకు దిగారట. ఇది నా ఇల్లు.. నా ఇంట్లో నువ్వెందుకు ఉన్నావ్? అని లావణ్య ప్రశ్నించగా.. ఇది నీ ఇల్లు కాదు అని మాటకు మాట సమాధానం ఇచ్చారట. ఇక లావణ్య ఇది నా భర్త రాజ్ తరుణ్ (Raj Tarun) ఇల్లు అని చెప్పగా.. రాజ్ తరుణ్ ఈ ఇంటికి వెళ్ళమన్నాడని , ఇంట్లో నుంచి వెళ్లకపోతే పోలీసులను తీసుకొస్తానని మస్తాన్ సాయి ఆమెను బెదిరించినట్లు సమాచారం. ఇకపోతే రాజ్ తరుణ్ వెళ్ళమన్నాడు అని మస్తాన్ సాయి చెప్పడంతో దీని వెనుక రాజ్ తరుణ్ హస్తం కూడా ఉందా అనే కోణంలో నెటిజన్స్ ఆరాతీస్తున్నారు.