YS Jagan – KCR: ఆ ఇద్దరూ పార్టీల అధ్యక్షులు. అంతేకాదు మాజీ సీఎంలు కూడ. తమ పార్టీలకు పునర్వైభవం తీసుకురావాలన్న ఆకాంక్ష ఇద్దరిదీ. మొన్నటి వరకు ఇద్దరూ మా అడుగులు.. ఇక ముందుకు వేస్తున్నాం అంటూ ప్రచారం సాగించారు. క్యాడర్ కూడ అయితే ఓకే అనే రేంజ్ లో రెడీ అయ్యారు. చివరకు ఆ చల్లని కాలం ముగిసింది. వారేమో క్యాడర్ లోకి రాలేదు. అసలు తమ పార్టీ అధినాయకుల మనసులో ఏముందో తెలుసుకొనే ప్రయత్నాల్లో ఆ రెండు పార్టీల నాయకులు తలమునకలు అవుతున్నారట. ఇంతకు ఆ ఇద్దరు నేతలెవరంటే.. మాజీ సీఎంలు కేసీఆర్, జగన్.
వీరిద్దరూ అధికారంలో ఉన్నన్ని రోజులు భాయ్.. భాయ్ మాదిరిగానే ఉన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో అయితే రానున్నది జగన్ రాజ్యమేనంటూ మాజీ సీఎం కేసీఆర్ జోస్యం కూడ చెప్పారు. అయితే ఫలితం తారుమారైంది. తెలంగాణ లో కేసీఆర్ మాజీ అయ్యారు.. ఏపీలో జగన్ కూడ మాజీ అయ్యారు. ఇద్దరికీ ఎన్నికలు కోలుకోలేని దెబ్బతీశాయని ఎన్నికల ఫలితాలను బట్టి చెప్పవచ్చు. తెలంగాణలో అయితే ఎంపీ ఎన్నికల్లో ఏమాత్రం హవా చూపించలేదు బీ ఆర్ఎస్. ఇలా వీరిద్దరూ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు సమాయత్తమయ్యారు.
సంక్రాంతి ముందు వరకు ఇద్దరిదీ ఒకటే మాట.. ఒకటే బాటలా టాక్ నడిచింది. జనవరి నెలాఖరున జనంలోకి వస్తున్నామని ఇద్దరూ ప్రకటించారు. తెలంగాణలో కేసిఆర్, ఏపీలో జగన్ ఒకేసారి జనంలోకి వస్తారని ఆయా పార్టీల క్యాడర్ కూడ భావించారు. కానీ చివరకు డ్యామిట్ కథ అడ్డం తిరిగిందనే తరహాలో.. ఇద్దరూ బయటకు రాలేదు. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాలలో కోడ్ అమల్లోకి వచ్చింది.
ఇప్పటికే జనంలోకి వచ్చి పర్యటన సాగించి ఉంటే దాని ఫలితం వేరేలా ఉండేదని, ఇప్పుడు వచ్చినా ఎన్నికల హంగామా కిందికే పోతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏపీలో వైసీపీ పరిస్థితి అయితే పెద్ద క్యాడర్ నాయకులు గుడ్ బై చెప్పడంతో క్యాడర్ చిన్నబుచ్చుకున్నారట. ఏకంగా విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో పార్టీలో కాస్త సైలెంట్ వార్ జరుగుతుందా అనే ప్రశ్నలను క్యాడర్ లేవనెత్తుతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో కేసిఆర్ అయితే ఇటీవల సమావేశం నిర్వహించి వస్తున్నా అంటూ మరోమారు తన వాణి వినిపించారు.
Also Read: Tirumala News: రథసప్తమికి తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
అదే తీరులో విదేశీ పర్యటన ముగించుకున్న జగన్ కూడ కేసీఆర్ రూట్ లోనే వస్తున్నా అంటూ ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది. అసలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల ప్రభావం కనుమరుగైతే, ప్రజల్లో పార్టీల స్థితిగతులపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే క్యాడర్ చేజారి పోతున్న వేళ, వీరు వేసే ప్లాన్స్ ఎవరికీ అంతుబట్టడం లేదట. మరి ఈ ఇద్దరు మాజీ సీఎంలు తమ పార్టీ క్యాడర్ కి భరోసా కల్పించేందుకు, కాపాడుకొనేందుకు ఏ రూట్ లో వెళ్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.