E-Paper
Advertisement

Suhas: సుహాస్ కొత్త మూవీ ‘శ్రీ‌రంగనీతులు’ నుంచి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

Suhas: సుహాస్ కొత్త మూవీ ‘శ్రీ‌రంగనీతులు’ నుంచి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల
Advertisement
Sri Ranga Neetulu
Sri Ranga Neetulu

Suhas: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. హీరో ఫ్రెండ్ రోల్స్‌లో ఎక్కువగా కనిపించి అందరినీ తన నటనతో అలరించాడు.

అయితే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రోజు టైం వస్తుందని అంటారు.. అలాంటి టైం సుహాస్‌కు వచ్చింది. సైడ్ క్యారెక్టర్స్ నుంచి డైరెక్ట్‌గా హీరోగా ప్రమోషన్ పొందాడు. కలర్ ఫొటో సినిమాలో హీరోగా చేశాడు.

Advertisement

ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో సుహాస్ నటనకు చాలా మంది ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక ఈ మూవీ తర్వాత సుహాస్ మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Also Read : ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం..

Advertisement

రైటర్ పద్మభూషణ్‌తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్‌గా అంబాజీపేట మ్యారేజీబ్యాండు సినిమాతో మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు సుహాస్. అయితే ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

అయితే ఈ సారి ఒక్కడిగా కాకుండా మరికొందరి నటీనటులతో భాగం అయ్యాడు. ఇప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానీశ‌ర్మ, విరాజ్ అశ్విన్ కలిసి నటిస్తోన్న కొత్త చిత్రం ‘శ్రీ‌రంగనీతులు’.

ఈ చిత్రానికి ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Also Read : చిన్నారిని అక్రమంగా దత్తత.. బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఎక్క‌డ వుండాల‌ని.. ఎక్క‌డున్నావో..’ అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌కు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందించారు. హ‌రికా నారాయ‌ణ్ దీనిని ఆల‌పించారు.

కాగా ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మాన‌వ సంబంధాలు, ప్రస్తుత కాలంలో నేటి యువ‌త మ‌న‌స్త‌త్వాలు, ప్రేమ గురించి తెలియజేసే సాంగ్ ఇదని అన్నాడు. ఇందులో ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో హత్తుకుంటాయి. కొత్త స్టోరీతో పాటు కమర్షియల్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×