BigTV English
Advertisement

RRR Re-Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రీ-రిలీజ్‌కు సిద్ధం.. ఈ సారి 3డీలో

RRR Re-Release: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రీ-రిలీజ్‌కు సిద్ధం.. ఈ సారి 3డీలో

RRR Re-Release: తెలుగు సినిమాను ప్రపంచానికి చాటి చెప్పింది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఎన్నో ఏళ్ల కష్టాన్ని సైతం మరిచిపోయేలా చేసింది ఆస్కార్‌. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ.. వరల్డ్ వైడ్‌గా కూడా దుమ్ము దులిపేసింది. విమర్శకుల సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. దర్శక ధీరుడు తెరకెక్కించిన ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగిపోయింది.


దీంతో దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్‌తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సినీ ప్రియులు థియేటర్లకు పరుగులు తీశారు.

ఆ మధ్య ఎక్కడ చూసినా ఈ మూవీ చర్చలే. కచ్చితంగా ఈ మూవీ ఆస్కార్‌కు వెళుతుందని అంతా భావించారు. అందరూ అనుకున్నట్లే ఈ మూవీ ఆస్కార్‌కు చేరుకుంది. ఇందులో భాగంగానే ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వరించింది. ఈ అవార్డుతో తెలుగు సినిమా కీర్తిని, పేరు ప్రతిష్టలను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. అంతేకాకుండా ఈ మూవీ ఎన్నో రికార్డులను సైతం నెలకొల్పింది.


Also Read: ఆస్కార్ వేదికపై మరోసారి ‘ఆర్ఆర్ఆర్’.. ఇంకా కొనసాగుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ హవా

కలెక్షన్లలో తనకంటే తోపు మరెవరూ లేరని నిరూపించింది. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టేసింది. నిర్మాతలకు సైతం లాభాల పంట పండించింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు యావత్ సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. రామ్ చరణ్ యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ ఎమోషన్ సీన్లతో సినీ అభిమానులు సెల్యూట్ కొట్టారు.

అంతటి ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుందంటే ఎలా ఉంటుంది. అవునండీ మీరు విన్నది నిజమే ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ చిత్రాన్ని మే 10 న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదే విషయంపై అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది. అయితే ఈ మూవీ 2డీ, 3డీ ఫార్మాట్లలో తెలుగుతో పాటు హిందీలోనూ రీ రిలీజ్ కానుంది. మరి ఇప్పుడు ఇంకెన్ని కలెక్షన్లను నమోదు చేస్తుందో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×