BigTV English

Malayalam Film 2018 : ఆస్కార్ నుంచి ‘2018’ సినిమా ఔట్ .. నిరాశతో సినీ లవర్స్..

Malayalam Film 2018 : ఆస్కార్ నుంచి  ‘2018’  సినిమా ఔట్ .. నిరాశతో సినీ లవర్స్..
Malayalam Film 2018

Malayalam Film 2018 : ప్రస్తుతం కంటెంట్ సాలిడ్ గా ఉంటే చాలు చిన్న చిత్రాలైనా సరే గట్టిగా ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళం లో భారీ సక్సెస్ అందుకున్న మూవీ 2018. ఒక సంవత్సరం సంఖ్యను పేరుగా పెట్టుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ సెలక్షన్స్ లో చోటు దక్కించుకోలేక పోయింది. ఈ విషయం సినీ అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. యావత్ సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవార్డు ఆస్కార్ అవార్డు. తాజాగా వెలువడిన ఆస్కార్ అవార్డ్ షార్ట్ లిస్ట్ జాబితాలో మొత్తం పది విభాగాలలో పోటీపడుతున్న చిత్రాలకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. అయితే అందరూ ఊహించినట్టు ఆ లిస్టులో 2018 చిత్రం పేరు లేదు.


ఈ జాబితా ప్రకారం హాలీవుడ్ మూవీస్ ‘బార్బీ’, ‘ఓపెన్‌ హైమర్‌’ఎక్కువ విభాగాలలో పోటీ పడుతున్నాయి. అయితే ఈసారి భారత్ నుంచి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటగిరి లో 2018 చిత్రం అధికారికంగా ఎంపికయింది. కానీ విడుదలైన జాబితాలో ఈ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.  డెన్మార్క్‌కు చెందిన ‘ది ప్రామిస్డ్‌ ల్యాండ్‌’, జపాన్‌కు చెందిన ‘పర్‌ఫెక్ట్‌ డేస్‌’, యూకేకు చెందిన ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’ మూవీస్ ఈ క్యాటగిరి లో ముందంజలో ఉన్నాయి.

2018లో కేరళలో భయంకరంగా సంభవించిన వరదలు అందరికీ గుర్తుండే ఉంటాయి. గాడ్స్ ఓన్ కంట్రీ .. ప్రకృతి విలయతాండవాన్ని తట్టుకోలేక గజగజ వనికింది. వందల మంది మరణానికి కారణమైన ఈ వరదల ఆధారంగా 2018 చిత్రం తెరకెక్కించారు మూవీ మేకర్స్. మలయాళం లో విడుదలైన ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ..కలెక్షన్స్ పరంగా కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. మరి ఈ మూవీకి ఆస్కార్ వచ్చే అవకాశం ఉంది అని అందరూ భావించారు కానీ తుది జాబితా విడుదలైన తరువాత ఆ అవకాశం లేదు అని తెలుసుకొని నిరాశ చెందారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×