BigTV English

Sriya Reddy : సలార్ లో ఇరగదీస్తున్న లేడీ విలన్ .. ఎవరో గుర్తుపట్టారా?

Sriya Reddy : సలార్ లో ఇరగదీస్తున్న లేడీ విలన్ .. ఎవరో గుర్తుపట్టారా?
Sriya Reddy

Sriya Reddy : సినిమాలు తీసే విధానం మారుతుంది.. అలాగే అందులో క్యారెక్టర్రైజేషన్స్ కూడా మారుతున్నాయి. ప్రస్తుతం లేడీ విల్లన్స్ కి ఉన్న హవా అంతా ఇంతా కాదు. అందుకే ఒకప్పటి నటీమణులు ఇప్పుడు లేడీ విలన్స్ గా బాగా సెటిల్ అయిపోతున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం మంచి లేడీ విలన్ గానే కాకుండా సపోర్టివ్ రోల్స్ లో కూడా ఇరగదీస్తోంది. ఈమె బాటలోని ఒకప్పటి కోలీవుడ్ నటిమని ఇప్పుడు సలార్లో లేడీ విలన్ అవతారం ఎత్తింది. ఆమె మరెవరో కాదు శ్రియా రెడ్డి.


ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఈ మీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు .విశాల్ ‘పొగరు ‘మూవీ లో లేడీ విలన్ గా నటించి తన నటనతో అదరగొట్టిన అమ్మాయి అంటే వెంటనే గుర్తుకు రావచ్చు. తమిళ్లో కొన్ని సినిమాలలో నటించిన ఈమె ఆ తరువాత విశాల్ సోదరుడు విక్రమ్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సెటిల్ అయిపోయింది. 2003లో చంద్ర సిద్ధార్థ డైరెక్షన్లో హీరో రాజా కాంబోలో వచ్చిన ‘అప్పుడప్పుడు” చిత్రం తో ఈమె నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీలో తన అందాల ఆరబోతతో అందరినీ ఆకర్షించింది.

ఆ తర్వాత ఇక్కడ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో మెల్లిగా తమిళ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. ఇప్పుడు ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి తెలుగులో సూపర్ అవకాశం దక్కించుకుంది శ్రియా రెడ్డి. ఈరోజు విడుదలైన ప్రభాస్ సలార్ మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోజుల్లోశ్రియా రెడ్డి ఇరగదీసే పెర్ఫార్మెన్స్ కనబరిచింది. ఈ మూవీ తర్వాత శ్రియాకి వచ్చిన ఆఫర్ ఎవరితోనో తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజి’. 


ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీలో ఆమె మంచి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం నెగిటివ్ స్టేట్స్ లో ఉన్న పాత్రలలో మంచి పర్ఫామెన్స్ అందించేవారు దొరకడం కాస్త కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో శ్రియా రెడ్డి మంచి పర్ఫామెన్స్ కనబరిస్తే సాలిడ్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో సెటిల్ అయిపోవచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. సలార్ మూవీ స్టోరీ ప్రకారం ఇంకా ఆమె పాత్ర బతికే ఉంది కాబట్టి సెకండ్ పార్ట్ లో కూడా ఆమెకు అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి సలార్ తో ఆమె కెరీర్ గాడిన పడుతుందేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×