BigTV English

Aattam: జాతీయ అవార్డు అందుకున్న ‘ఆట్టం’ మూవీ.. అసలేముంది ఇందులో.. ?

Aattam: జాతీయ అవార్డు అందుకున్న ‘ఆట్టం’ మూవీ.. అసలేముంది ఇందులో.. ?

Aattam: 70 వ జాతీయ అవార్డుల పండగ మొదలయ్యింది. నేడు కేంద్ర ప్రభుత్వం అన్ని భాషల్లో ఉత్తమ ప్రతిభను కనపర్చిన సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రాల్లో తెలుగులో కార్తీకేయ 2, కన్నడలో కెజిఎఫ్ 2, మలయాళంలో ఆట్టం, తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ అవార్డులను దక్కించుకున్నాయి. ఆట్టం సినిమా తప్ప.. మిగతా అన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు తమ సత్తా చాటుతున్న విషయం తెల్సిందే.


ఇక జాతీయ అవార్డు రావడంతో అందరి ఆట్టం సినిమా మీద పడింది. జాతీయ అవార్డు వచ్చేంతగా ఆ సినిమాలో ఏముంది అని ప్రేక్షకులు సినిమా గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. థియేటర్ లో రిలీజ్ కాకముందే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమాకు ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించాడు.

1958 లో టీవీలో ప్రసారమయ్యే 12 యాంగ్రీమెన్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.వినయ్ ఫోర్ట్,
కళాభవన్ షాజోన్,అజీ తిరువంకుళం, జాలీ ఆంటోనీ, మదన్ బాబు కె, నందన్ ఉన్ని, ప్రశాంత్ మాధవన్, సనోష్ మురళి, సంతోష్ పిరవం, సెల్వరాజ్ రాఘవన్ VR, సిజిన్ సిజీష్, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా.. జరీన్ షిహాబ్ హీరోయిన్ గా నటించింది.


కేరళలోని ఒక నాటక బృందం. అందులో 12 మంది నటులు. ఒకే ఒక్క అమ్మాయి. ఆమె అంజలి. ఎక్కడకు వెళ్లినా ఈ బృందమే నాటకాలు వేస్తూ ఉంటారు. అయితే పూర్తిగా నాటకాలు వేసే బ్యాచ్ కూడా కాకపోవడంతో.. ఎవరి పనులు వారు చూసుకుంటూనే కుదిరినప్పుడల్లా నాటకాలు వేస్తూ ఉంటారు. ఈ బృందంలో హరికి, వినయ్ కు పడదు.

హరి సినిమాల్లో నటిస్తూ ఉండడంతో.. బ్యాచ్ లో మొత్తం అతనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వినయ్ కు నచ్చదు. దీనివలన వీరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఒకసారి.. వీరి నాటకానికి ఫిదా అయిన విదేశీ జంట.. 12 మందిని తమ ఇంటికి ఆతిధ్యానికి రావాల్సిందిగా కోరతారు. దీంతో నాటక బృందం మొత్తం ఆ జంట ఇంటికి వెళ్లి.. మద్యంలో మునిగితేలుతారు. ఇక ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. అంజలి.. ఆ ఇంట్లోనే ఒక కిటికీకి ఆనుకొని ఉన్న రూమ్ లో నిద్రపోతుంది.

అర్ధరాత్రి.. ఎవరో ఒకరు కిటికీలో నుంచి చేతులు పోనించి.. అంజలితో అసభ్యకరంగా తాకి పారిపోతాడు. ఆ 12 మందిలో అంజలితో మిస్ బిహేవ్ చేసింది ఎవరు.. ? చివరకు అంజలి అతనిని కనుక్కుంటుందా.. ? ఈ ఘటన జరిగాకా ఆ బృందంలో వచ్చిన మార్పులేంటి.. ? అనేది సినిమా కథ. తెలుగులో అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమా గుర్తుందా.. ? అందులో బన్నీ ఒక డైలాగ్ చెప్తాడు. ” నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు.. నిన్ను ఎవరు చూడడం లేదు అని నీకు తెలిసినప్పుడు.. నువ్వెంటో.. అది నీ క్యారెక్టర్” అని.

ఇక ఈ లైన్ తోనే ఆట్టం సినిమా తెరకెక్కింది. పైకి మంచిగా కనిపించే మనుషులు.. ఎవరు చూడని సమయంలో తమలోని మరో వ్యక్తిని నిద్రలేపుతారు. దాని వలన వచ్చే ఇబ్బందులనే ఈ సినిమాలో చూపించారు. కథ మొత్తం ఎంతో ఆసక్తిగా ఉంటుంది.. డైరెక్టర్ తెరకెక్కించిన విధానం కూడా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జాతీయ అవార్డు సినిమా మీద ఓ లుక్ వేసేయ్యండి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×