Manchu Lakshmi: మంచు వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు పెద్ద కూతురుగా.. మంచు మనోజ్, మంచు విష్ణుల ముద్దుల అక్కగా టాలీవుడ్ లో ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వచ్చీరానీ ఇంగ్లీష్ తో ఇబ్బంది పడే జనల మధ్య ఆమె అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ యెంత ట్రోలింగ్ కు గురైందో అందరికీ తెల్సిందే.
ట్రోలింగ్ విషయం పక్కన పెడితే.. లక్ష్మీ మనసు బంగారం. ఆమె చేసే సేవా కార్యక్రమాలు ఎంతోమందికి ఆదర్శం. ఇక గత కొన్ని నెలలుగా లక్ష్మీ.. హైదరాబాద్ ను వదిలి ముంబైలో మకాం పెట్టిన విషయం తెల్సిందే. అక్కడకు వెళ్లిన తరువాత అమ్మడి ఆహార్యం పూర్తిగా మారిపోయింది. అయితే బికినీ.. లేకపోతే చిన్న షార్ట్స్ ఎక్కువగా వీటితోనే కనిపిస్తుంది.
Dhanush- Nayan: వివాదం తరువాత కలుసుకున్న ధనుష్- నయన్.. ఫోటో వైరల్
రోమ్ వెళ్ళినప్పుడు రోమన్ లానే ఉండాలి అనే సామెతను మంచు లక్ష్మీ నిజం చేస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం అందరికీ తెల్సిందే. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో పాటు తన మనసుకు అనిపించిన ఏ విషయాన్నీ అయినా అభిమానులతో నిర్మొహమాటంగా పంచుకుంటూ ఉంటుంది.
మంచు లక్ష్మీకి తన కూతురు విద్యా నిర్వాణ అంటే పంచప్రాణాలు. తన కోసం ఏదైనా చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది కూడా. కొద్దిగా తీరిక ఉన్నా కూడా తన కూతురు యాపిల్ తో కలిసి ఇదుగో ఇలా ఏదో ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది.
SJ Suryah: గేమ్ ఛేంజర్.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.. ఈ రేంజ్ ఎలివేషన్ ఏందయ్యా
తాజాగా ఈ తల్లీకూతుళ్లు.. ఒక ఇంగ్లిష్ పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపించారు. సాంగ్, డ్యాన్స్ అంతా బానే ఉంది కానీ, లక్ష్మీ వేసుకున్న స్కర్ట్ చాలా చిన్నదిగా ఉంది. దీంతో ఆమె డ్రెస్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. నీ కూతురు అంత చిన్న బట్టలు వేసుకుంటే అందంగా ఉంది.. నువ్వు ఈ వయస్సులో ఇలాంటి స్కర్ట్ వేసుకొని ఏం చూపిస్తున్నావు జనాలకు అని కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా నీకూతురు స్కర్ట్ పొరపాటున నువ్వు వేసుకున్నావా.. ? అంతా కనిపిస్తుంది. ఇలాంటి బట్టలు వేసుకోకండి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం లక్ష్మీ తెలుగులో అగ్ని నక్షత్రం అనే సినిమా చేస్తుంది. ఇది కాకుండా బాలీవుడ్ లో ఛాన్స్ లు కోసం ఎదురుచూస్తుంది. మరి అక్కడ అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.