BigTV English

SJ Suryah: గేమ్ ఛేంజర్.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.. ఈ రేంజ్ ఎలివేషన్ ఏందయ్యా

SJ Suryah: గేమ్ ఛేంజర్.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.. ఈ రేంజ్ ఎలివేషన్ ఏందయ్యా

SJ Suryah: ఎప్పుడెప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్  సినిమా రిలీజ్ కి వస్తుందా అని మెగా ఫాన్స్  వెయ్యి కళ్లతో ఎదురుచూశారు.  ఇక ఆ ఎదురుచూపులకు సమాధానంగా జనవరి 10న సంక్రాంతి రేసులో ఈ సినిమా దిగుతుంది అని తెలిసి ఫాన్స్ ఎగిరి గంతేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్.


దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఇక స్టార్ నటుడు ఎస్ జె సూర్య శ్రీకాంత్ జయరాం తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను మరింత పెంచేశాయి. సమయం దొరికినప్పుడల్లా దిల్ రాజు ఈ సినిమా గురించి హైప్ ఇస్తూనే ఉన్నాడు.

Pushpa 2: శ్రీలీల కిస్సిక్ వస్తుంది.. ఇండస్ట్రీ మొత్తం ఊగిపోవడానికి సిద్ధంగా ఉండాలమ్మా


ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను  అభిమానులతో పంచుకున్నాడు సూర్య.  అప్డేట్ తో పాటు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాకు సూర్య డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు తెలిపాడు. ఆ విషయాన్నీ ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

” ఇప్పుడే నా డబ్బింగ్ పూర్తయింది. గేమ్ ఛేంజర్ లో రెండు కీలక సన్నివేశాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఒకటి రామ్  చరణ్ గారితోటి.. మరొకటి శ్రీకాంత్ గారి తోటి చేసిన రెండు సీన్స్ కు డబ్బింగ్ చెప్పడానికి నాకు మూడు రోజులు సమయం పట్టింది. ఆ తర్వాత అవుట్ పుట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.

Sankranthi Movies: 2019 రిపీట్ అయితే.. ఈసారి కూడా వెంకీ మామనే విన్నర్.. ?

థియేటర్స్ లో సినిమా చూసే ప్రేక్షకుడు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తాడు. పోతారు మొత్తం పోతారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన దర్శకుడు  శంకర్, నిర్మాత దిల్ రాజ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంక్రాంతికి ‘రామ్’ పింగ్.   కలుద్దాం ఫ్రెండ్స్ అంటూ రాసుకొచ్చాడు. ఒక్క పోస్ట్ తోనే ఏం ఎలివేషన్ ఇచ్చావయ్యా ..సూపర్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  ఇక దీంతో సినిమాపై మరింత అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×