Mechanic Rocky Twitter Review : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.Mechanic Rocky Twitter Review ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన “మెకానిక్ రాకీ ” ( Mechanic Rocky ) సినిమాతో నవంబర్ 22 న థియేటర్లలో వచ్చేసింది. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించారు. రిలీజ్ కు ముందు విశ్వక్ సినిమాలకు ఉన్న టాక్ ఏంటో అందరికి తెలిసిందే.. మరి ఈ సినీమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ట్రైలర్ తర్వాత ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రివ్యూవర్ల పై చేసిన కామెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ వ్యాఖ్యలుఎంతగా వివాదాస్పంగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సినిమా పై భారీ క్రేజ్ ను. అందుకొనేలా చేసింది. ఇక ఈ సినిమాలో హీరో తన తండ్రిని అలాగే మెకానిక్ షెడ్డుని కోల్పోయిన తర్వాత ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనేది కథ అంటున్నారు. శ్రద్దా శ్రీనాథ్ రోల్ లో ఒక ట్విస్ట్ ఉంటుందట. ఇక మీనాక్షి చౌదరి గ్లామర్ తో మెప్పిస్తుందని చెబుతున్నారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయ్యాయనే టాక్ వినిపిస్తుంది.. ఇక యూత్ కి కనెక్ట్ అయ్యే కామెడీ పంచులు బాగా పేలాయి అని అంటున్నారు. మొత్తంగా ‘మెకానిక్ రాకీ’ ఒక మంచి మూవీ అనే టాక్ ను సొంతం చేసుకున్న తెలుస్తుంది. ఇక ప్రీమియర్ షోలతో మూవీ ఎలా ఉందో అని నెటిజన్లు ట్వీట్ చేశారు. మరి ఆ రివ్యూ ఏంటో ఒకసారి చూసేద్దాం..
మెకానిక్ రాకీ ఫస్ట్ హాఫ్ అదిరిపోయే సీన్స్ ఉన్నాయి.. ఇంట్రవెల్ వరకు సినిమా బాగుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
#MechanicRocky: Pitty Average First Half with Good Interval Block 👍🏼pic.twitter.com/su0YtMiyDf
— NEWS3PEOPLE (@news3people) November 21, 2024
విశ్వక్ సేన్ మెకానిక్ మూవీ ఫస్ట్ ఆఫ్ రొటీన్ గా సాగిందని చెప్పాడు. ఇంట్రవెల్ సమయానికి స్టోరీ ఊపందుకుంటుంది. మీనాక్షి చౌదరి అద్భుతంగా నటిచింది. ఆమె పాత్రకు న్యాయం చేసిందని , ఇక ఒక హృదయపూర్వక విన్నపం. దయచేసి కనీసం ఒక వారం పాటు ఎటువంటి స్పాయిలర్‌లను ఇవ్వకండని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
The first half of #MechanicRocky begins with a familiar routine, but it gradually gains momentum well before the interval. #MeenakshiChaudhary shines in her role and brings a lovely presence to the film. #Vishwaksen continues to impress with his charming performance. pic.twitter.com/TVkRm2PBdZ
— Matters Of Movies (@MattersOfMovies) November 21, 2024
మొత్తానికి ఈ సినిమా టాక్ ను బట్టి మంచి టాక్ ను అందుకుందని తెలుస్తుంది.. ఇక థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. మొత్తానికి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో మొదటి షోతోనే తేలిపోతుంది..