Dhanush- Nayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వివాదం ఎంత పెద్ద రచ్చ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో నయన్ జీవితంలోని కొన్ని అంశాలను ఒక డాక్యుమెంటరీగా నెట్ ఫ్లిక్స్ తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఇందులో ఒక క్లిప్ కోసం ధనుష్, నయన్ కొట్టుకున్న విషయం కూడా తెల్సిందే. విజయ్ సేతుపతి, నయన్ జంటగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నేను రౌడీనే. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
నయన్, విగ్నేష్ కలవడానికి ఈ సినిమానే పునాది. ఈ సెట్ లోనే వీరి ప్రేమ మొదలయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన సీన్స్ ను ఈ డాక్యుమెంటరీలో వాడడం కోసం నయన్ .. ధనుష్ ను సంప్రదించడం జరిగింది. కానీ,ధనుష్.. రెండేళ్లుగా ఆ అనుమతి పత్రం ఇవ్వడం లేదని నయన్ ఆరోపించింది. అయితే ధనుష్ అనుమతి లేకుండా ఈ లోపు నయన్ ట్రైలర్ లో ఈ సీన్స్ ను యాడ్ చేసింది. ఆ సీన్స్ ను చూసిన ధనుష్.. నయన్ పై లీగల్ గా కేసు వేసాడు.
Regina Cassandra : డిఫరెంట్ లుక్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న రెజీనా
తన అనుమతి లేకుండా క్లిప్స్ ను వాడినందుకు రూ. 10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే వాటిని తొలగించాలని డిమాండ్ చేశాడు ధనుష్ . ఇక దీంతో ఫైర్ అయిన నయన్.. బహిరంగంగా ధనుష్ పై నోరు పారేసుకుంది. అతని తండ్రివలన ఇండస్ట్రీకి వచ్చాడని, ఇలా ఎదుటివారిని వేధించడానికి సిగ్గు ఉండాలని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ సంచలనాన్ని సృష్టించింది. హీరోయిన్స్ లో చాలామంది నయన్ కు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నెటిజన్స్ అందరూ ధనుష్ కు సపోర్ట్ చేస్తూ వచ్చారు.
డాక్యుమెంటరీకి నయన్ రూ. 40 కోట్లు తీసుకుంటుంది.. ఊరికే యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఎలాంటి క్లిప్స్ అయినా వాడుకోవచ్చు. అలా డబ్బు తీసుకొని చేసినప్పుడు ధనుష్ డబ్బులు అడగడంలో తప్పేమి లేదు కదా అని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న సమయంలో అనుకోకుండా ధనుష్ – నయన్ ఎదురెదురు పడ్డారు. ఒక పెళ్ళికి ధనుష్, నయన్ దంపతులు హాజరయ్యారు. అనుకోకుండానే జరిగినా ఈ వివాదం తరువాత వీరు ఇలా ఒకే దగ్గర కనిపించడం మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.
SJ Suryah: గేమ్ ఛేంజర్.. దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.. ఈ రేంజ్ ఎలివేషన్ ఏందయ్యా
ధనుష్ ఒక సోఫాలో కూర్చోగా .. ఆయన పక్కన మరో సోఫాలో నయన్ దర్శనమిచ్చింది. ఇక ఇద్దరు పక్క పక్కనే ఉన్నా.. మీకు మీరే మాకు మేమే అన్నట్లు ముఖముఖాలు కూడా చూసుకోకుండా కూర్చున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.