E-Paper
Advertisement

Manchu Lakshmi: ‘హాలీవుడ్‌లో ఉంటే స్టార్ అయ్యేదాన్ని, టాలీవుడ్‌లో అవకాశాలు లేవు’..

Manchu Lakshmi: ‘హాలీవుడ్‌లో ఉంటే స్టార్ అయ్యేదాన్ని, టాలీవుడ్‌లో అవకాశాలు లేవు’..
Advertisement

Manchu Lakshmi: ఒక్కొక్కసారి తాము పనిచేస్తున్న సినీ పరిశ్రమపైనే సెలబ్రిటీలు వేసే కామెంట్స్.. కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తాయి. వారు చెప్పేది నిజమే అయినా అది ఒప్పుకోవడానికి చాలామంది ముందుకు రారు. తాజాగా మంచు లక్ష్మి కూడా టాలీవుడ్‌పై అలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి నటిగా మారిన లక్ష్మి.. తాజాగా టాలీవుడ్‌ను విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మంచు లక్ష్మి. అప్పట్లో టాక్ షోలు అనేవి తెలుగులో అంత పాపులర్ కాలేదు. అయినా తన సొంత నిర్మాణంతో ఒక టాక్ షోను ప్రారంభించి.. అలాంటి టాక్ షోలు చేయాలి అనుకునేవారికి స్ఫూర్తిగా నిలిచింది. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించింది. అమెరికాలో సెటిల్ అయిన లక్ష్మి.. టాలీవుడ్‌లో అడుగుపెట్టాలి అని ఒకేఒక్క ఆశతో ఇండియాలో వచ్చి సెటిల్ అయ్యింది. కానీ ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసింది.

Advertisement

తాజాగా మంచు లక్ష్మి పాల్గొన్న ఇంటర్వ్యూలో మరోసారి టాలీవుడ్‌పై కామెంట్స్ చేసింది. ‘నేను హాలీవుడ్ యాక్టర్‌ని, అక్కడ సినిమాలు చేశాను. ఒకవేళ నేను ఇప్పటికీ అక్కడే ఉండుంటే ఇప్పటికీ స్టార్ అయిపోయేదాన్ని. కానీ నా బిడ్డ కోసం కుటుంబానికి దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చేశాను. ఇప్పటికీ నాకొక అవకాశం వస్తే కచ్చితంగా హాలీవుడ్‌కు వెళ్లిపోతాను. ఈసారి వెళ్తే మళ్లీ తిరిగి రాను. నేను ఇక్కడ చాలా కష్టపడ్డాను. కానీ ఇక్కడ తెలుగమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు.’ అంటూ మనసులో మాట బయటపెట్టింది.

‘మధుశాలినీ, నిహారిక, బిందు మాధవి, శివానీ.. ఇలా ఎంతోమంది తెలుగమ్మాయిలు ఉన్నారు. కానీ వారికి ఇక్కడ అవకాశాలు లేవు. ప్రేక్షకులు కూడా వేరే రాష్ట్రం నుండి వచ్చిన అమ్మాయిలనే చూడడానికి ఇష్టపడుతున్నారు.’ అని బోల్డ్‌గా చెప్పేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం మంచు లక్ష్మికి ఒక ప్రొడక్షన్ హౌజ్ ఉంది. దాని ద్వారా తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వవచ్చు కదా అని అడగిన ప్రశ్నకు తాను స్పందించింది. ‘నాకు ప్రొడక్షన్ హౌజ్ ఉంది. కానీ ఎంతమందికి సాయం చేయగలను. నాకు సరైన అవకాశాలు రానప్పుడు వేరే వాళ్లకి ఎలా అవకాశాలు ఇవ్వను’ అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్.. సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×