
BJP news telangana: బీజేపీ జోరు పెంచింది. ఎన్నికలకు అందరికంటే ముందుగా రెడీ అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎలక్షన్లను.. సెమీ ఫైనల్‌గా భావిస్తోంది. సెమీస్‌లో గెలిచి.. ఫైనల్‌లో హిట్ కొట్టేలా నెట్ ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చేసింది అధిష్టానం. ఇప్పుడు 4 రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది కమలదళం.
తెలంగాణపై బీజేపీది స్పెషల్ ఫోకస్. సౌత్‌లో హోప్స్ ఉన్న ఏకైక రాష్ట్రం. ఎందుకోగానీ.. జోరు మీదున్న బండికి స్పీడ్ బ్రేకులేసింది. ఏకంగా అధ్యక్ష పీఠం నుంచి దించేసింది. కిషన్‌రెడ్డికి కొత్తగా మరోసారి కిరీటం కట్టబెట్టింది. అదే ఊపులో.. తెలంగాణకు పార్టీ ఇన్‌ఛార్జ్‌ను కూడా ప్రకటించేసింది.
తెలుగు రాష్ట్రాలపై మంచి అవగాహన ఉన్న ప్రకాశ్ జవదేకర్‌ను.. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది బీజేపీ అధిష్టానం. రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు ఆయన. బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలోనూ ఓసారి పాల్గొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల బాధ్యతలు చూశారు. ఇప్పుడు తెలంగాణ అప్పగించారు. ప్రకాశ్ జవదేకర్‌కు తోడుగా.. కో-ఇన్‌ఛార్జ్‌గా.. సునీల్ బన్సల్‌ను నియమించారు.
ఇక.. రాజస్థాన్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా భూపేంద్ర యాదవ్, చత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా ఓం ప్రకాశ్ మాథుర్ పేర్లను ప్రకటించింది పార్టీ హైకమాండ్.