E-Paper
Advertisement

Manchu Lakshmi: ఈ విషయాన్ని రచ్చ చేయొద్దు ప్లీజ్.. విష్ణు, మనోజ్‌ల గొడవపై లక్ష్మీ రియాక్షన్ ఇదే..

Manchu Lakshmi: ఈ విషయాన్ని రచ్చ చేయొద్దు ప్లీజ్.. విష్ణు, మనోజ్‌ల గొడవపై లక్ష్మీ రియాక్షన్ ఇదే..
Advertisement

Manchu Lakshmi: మంచు విష్ణు-మనోజ్‌ల మధ్య వివాదం కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ.. తాజాగా బయటకొచ్చిన వీడియోతో రచ్చకెక్కింది. తన అనుచరులను విష్ణు ఎలా కొడుతున్నాడో చూడండంటూ మనోజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మోహన్ బాబు చెప్పడంతో మనోజ్ ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ వీడియోతో వారిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే ఈ వ్యవహారంపై మంచు లక్ష్మి స్పందించింది. ఈ విషయాన్ని ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరిగే గొడవలానే పరిగణించాలని.. అనవసరంగా రచ్చ చేయొద్దని కోరింది. త్వరలోనే వారిద్దరి మధ్య వివాదం పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనవసరంగా పిచ్చి రాతలు రాయొద్దని హెచ్చరించింది.

Advertisement

అన్నదమ్ముల గొడవ ఇదే..!

కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య విభేదాలున్నాయని వార్తలు వచ్చాయి. మనోజ్- భూమా మౌనికారెడ్డి పెళ్లి సమయంలో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అందుకే మనోజ్ తన రెండో వివాహాన్ని గ్రాండ్ కాకుండా సింపుల్ గా చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకలో విష్ణు అంటీముట్టనట్టు వ్యవహరించాడు. మంచు లక్ష్మినే తమ్ముడి పెళ్లి వేడుకను దగ్గరుండి జరిపించింది. ఈ వివాహ వేడుకకు విష్ణు తన ఫ్యామిలీతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో అన్నదమ్ముల మధ్య ఏదో వివాదం నడుస్తోందని టాక్ వచ్చింది.

Advertisement

అన్నదమ్ముల వివాదాల నేపథ్యంలో మనోజ్ వద్ద పనిచేస్తున్న సారథి ఇంటికెళ్లి విష్ణు దాడికి దిగాడని తెలుస్తోంది. విష్ణు దాడిలో గాయపడిన సారథి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి ఘటనపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన అన్న వ్యవహార శైలిని తప్పుపట్టాడు. దాడి చేయడం తగునా అని ప్రశ్నించాడు. అక్కడతో ఆగలేదు. దాడి దృశ్యాలను రిలీజ్ చేసి విష్ణు తీరును ప్రపంచానికి చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

ఒకప్పుడు మంచు ఫ్యామిలీ ఒకే భవనంలో ఉండేది. కానీ కొంతకాలంగా వేర్వేరు ఇళ్లలో విష్ణు, మనోజ్ ఉంటున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య మంచి సంబంధాలులేవని మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలో తేలిపోయింది. ఆ సమయంలో మోహన్ బాబుతో విష్ణు సన్నిహితంగా ఉండగా .. మనోజ్ చాలా దూరంగా నిల్చున్నాడు. అలాగే రెండేళ్లుగా విష్ణకు మనోజ్ బర్త్ డే విషెస్ చెప్పడం లేదు. అంటే అప్పటి నుంచే అన్నదమ్ముల మధ్య విభేదాలున్నాయని స్పష్టమవుతోంది. అయితే వివాదానికి కారణాలేంటి? విభేదాలు ఎందుకొచ్చాయి? ఈ విషయం తెలియాలంటే విష్ణు గానీ, మనోజ్ కానీ బయటకొచ్చి మాట్లాడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×