BigTV English

Manchu Manoj:‘మంచు’ వార్నింగ్ అందుకేనా?

Manchu Manoj:‘మంచు’ వార్నింగ్ అందుకేనా?

Manchu Manoj respond on child abuse videos(Latest news in tollywood):


ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్స్ తో తరచుగా వార్తలలోకి ఎక్కుతుంటారు మంచు మనోజ్. సామాజిక బాధ్యత కూడా మన హీరోకి కూసింత ఎక్కువే. చుట్టూ జరుగుతున్న ఘోరాలు, నేరాలపై తనకెందుకులే అనుకునే టైపు అస్సలు కాదు. ప్రస్తుతం ఈ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచువారబ్బాయి స్పందించిన తీరుకు హ్యాట్సాఫ్ అంటున్నారు. మరి అంతలా అభినందనలు అందుకుంటున్న మంచు మనోజ్ ఇంతకీ ఏ విషయంపై స్పందించారో తెలుసు కుందాం..సమాజంలో చిన్నారుల పట్ల జరుగుతున్న అన్యాయానికి రియాక్ట్ అయ్యారు మనోజ్. కొందరు వ్యక్తలు చిన్నారుల విషయంలో అనుచితంగా ప్రవర్తిస్తుంటారని, వాళ్లని లైంగికంగా వేధిస్తుంటారని కామెంట్స్ చేశారు. మరి కొందరు ఏకంగా చిన్నారులపైనే అసభ్యకరమైన వీడియోలు చేస్తుంటారని పైగా సోషల్ మీడియాలో లైక్ చెయ్యమంటూ పోస్టింగులు చేస్తుంటారని, హాస్యం ముసుగేసి చిన్నారులతో వాళ్ల నోటి వెంట బూతులు మాట్లాడిస్తున్న తీరు చాలా బాధాకరం అన్నారు. అలాంటి వీడియోలు చిన్నారులపై విషప్రభావం చూపుతాయని అన్నారు.తరచుగా ఇలాంటివి పోస్టింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని ఉద్దేశించి ఘాటుగా స్పందించారు మంచు వారబ్బాయి. అమ్మ తోడు నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు.

రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే


తెలుగు రాష్ట్రాలలో చిన్నారులపై జరుగుతున్న అన్యాయాలపై గతంలోనూ తాను స్పందించానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళలు,చిన్నారులకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత అయా ప్రభుత్వాలదే అన్నారు. దయచేసి ఇలాంటి విషయాలపై ఎలాంటి అలసత్వం వద్దు అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే నిందితులు ఏ ఒక్కరినీ ఉపేక్షించవద్దని కోరుతున్నారు. అలాగే పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి అలాంటి పోస్టింగులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే యూఎస్ లోని భారత ఎంబసీ అధికారులకు కూడా విజ్ణప్తి చేశారు.

సాయి దుర్గా తేజ్ కు సీఎం ప్రశంసలు

ఇదే అంశంపై గతంలో టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ పోస్టింగ్ పెట్టారు. సోషల్ మీడియాలు కంట్రోల్ తప్పాయని , చిన్నారలను మభ్యపెట్టి అసభ్యర వీడియోలు చేస్తున్నారని అలాంటి మానవ మృగాల నుండి మన పిల్లలలను రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనా ఉందని అన్నారు. అలాంటి నీచులకు తల్లిదండ్రులు పడే బాధలు ఎన్నటికీ అర్థం కావని పిల్లలకు చెందిన ఫోటోలు, వీడియోలు నెట్ లో పోస్ట్ చేసేముందు కాస్త ఆలోచించుకుని పెట్టాలని సూచించారు. కాగా సాయి దుర్గా తేజ్ పెట్టిన పోస్టింగ్ కు అప్పట్లో సీఎం రేవంత్ స్పందించారు. చిన్నారుల భద్రత తమ ఎజెండా అని ..దీనిని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు హీరోకి అభినందలు, సర్వత్రా ప్రశంసల జల్లు కురిపించారు.
కాగా ఇప్పుడు మంచు మనోజ్ పెట్టిన పోస్టింగ్ పై సోషల్ మీడియా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×