E-Paper
Advertisement

Teja Sajja Mirai: తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాలో టాలీవుడ్ మరో మాస్ హీరో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Teja Sajja Mirai: తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాలో టాలీవుడ్ మరో మాస్ హీరో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Manchu Manoj Playing Key Role in Teja Sajja’s ‘Mirai’: యంగ్ హీరో తేజ సజ్జ ఈ ఏడాది ‘హనుమాన్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జాంబి రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు తేజ సజ్జ – దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మరోసారి ‘హనుమాన్’తో ఎవరూ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీతో అటు తేజ సజ్జ పేరు.. ఇటు ప్రశాంత్ వర్మ పేరు అమాంతంగా పెరిగిపోయింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనంతరం స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి సంక్రాంతి రేసులో విన్నర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలో తేజ సజ్జ యాక్టింగ్ అందరికీ నచ్చింది. ఇక ఈ మూవీ ఘన విజయం సాధించడంతో తేజకు వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

అందులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీలనే ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక సరికొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మేరకు రవితేజతో ‘ఈగల్’ మూవీ తీసిన దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనితో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి తాజాగా మేకర్స్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ మేరకు ఈ సినిమాకు గానూ ‘మిరాయ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి.

Also Read: తేజ సజ్జ కొత్త సినిమా ‘మిరాయ్’.. ఏంటి బాసు ఆ లేడీతో ఫైట్..?

అందులో తేజ సజ్జ మాస్ యాక్షన్ సీన్లలో కనిపించి అదరగొట్టేశాడు. గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్ మరో రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. ఈ గ్లింప్స్ ప్రకారం.. ఈ మూవీ ఒక గ్రంథం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా తేజ సజ్జ మరో హిట్టు కొట్టబోతున్నాడని ప్రేక్షకులు, అభిమానులు చర్చించుకుంటున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి తాజాగా మరొక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అఫీషియల్ అప్డేట్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.

అయితే ఈ మూవీలో అతడు సెకండ్ హీరోగా కనిపిస్తారా? లేక విలన్‌గా కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మే 20న మంచు మనోజ్ బర్త్ డే కావడంతో ఆ రోజు ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్‌ని రివీల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ ‘మిరాయ్’ సినిమా వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్ 18న గ్రాండ్‌గా 2డి, 3డిలో రిలీజ్ కానుంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×