Big Stories

EVM-VVPAT: ఈవీఎం క్లిక్ చేస్తే బీజీపీ అదనంగా ఓట్స్ పడుతున్నాయా..? ఓ ఈవీఎం.. ఎన్నో డౌట్స్!

Supreme Court Hearing on Kerala’s EVM-VVPAT: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ మెషిన్.. ప్రజలు, పార్టీల తలరాతలను డిసైడ్ చేసే మెషిన్ ఇది. అలాంటి ఈవీఎంల పనితీరుపై ఇప్పుడు కొత్త డౌట్స్ మొదలయ్యాయి. మాములుగానే ఈవీఎంల పనితీరుపై ఎప్పటి నుంచో ఎన్నో అనుమానాలు. ఎవరికి ఓటు వేసినా ఓటు బీజేపీకే పడుతుంది అనేది లెటెస్ట్ ఆరోపణ. కానీ ఇప్పుడీ ఆరోపణలను మరింత పెంచింది కేరళ ఘటన.

- Advertisement -

ఇంతకీ కేరళలో ఏం జరిగింది? అందులో నిజమెంత? గ్రౌండ్ రియాల్టీ ఏంటి? ముందుగా కేరళలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కేరళలోని కాసర్‌గోడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇందులో ఓ నాలుగు ఈవీఎం మెషిన్లు ఇప్పుడీ పంచాయితీ కారణమయ్యాయి. మాములుగా బీజేపీకి వేసిన ఓట్ల కంటే ఎక్కువ కౌంట్ చూపించాయి ఈ మెషిన్లు. ఈ విషయాన్ని గమనించిన LDF, UDF పార్టీ అభ్యర్థుల ఏజెంట్లు వెంటనే ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు తాము చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రుజువయ్యాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

కాసర్‌గోడ్ నియోజకవర్గంలో నోటాతో కలిపి 10 గుర్తులు ఉన్నాయి. ఒకసారి బీజేపీ గుర్తైన కమలం పువ్వుపై ప్రెస్ చేస్తే.. వీవీప్యాట్‌లో రెండు ఓట్లు నమోదవుతున్నాయనేది నేతల ఆరోపణలు. మరే ఇతర పార్టీల గుర్తులకు ఇలా జరగడం లేదని ఒక్క బీజేపీకే ఇలా జరుగుతుందంటున్నారు. ఎన్నికలు ప్రారంభమవుతున్న ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఈవీఎం మెషిన్లు, వీవీప్యాట్‌లపై మళ్లీ కొత్త అనుమానాలకు తెరలేపాయి.

Also Read: Ration Free: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. మన దేశంలో రేషన్ ఫ్రీ: యూపీ సీఎం

కేరళ ఘటనను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వద్దాం. ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం అనేక అవకతవకలకు దారి తీస్తుందంటూ పిటిషన్లు వచ్చాయి. ఈ పిటిషన్‌లో హైలెట్ పాయింట్స్ ఏంటంటే.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా.. అనే రెండు ప్రభుత్వ సంస్థల డైరెక్టర్లు బీజేపీతో టైఅప్ అయ్యారు. ఈ రెండు సంస్థలు బీజేపీకి అనుకూలంగా పనిచేసేలా వారు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటరీ కమిటీ ఈవీఎంలలో అవకతవకలను గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ దీనిపై నోరు మెదపడం లేదు. ఇలా మరికొన్ని ఆరోపణలు ఉన్నాయి పిటిషన్‌లో. వీటిపైనే అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతుంది. ఇలాంటి సమయంలోనే కేరళలో ఈ సీన్ జరిగింది.

కేరళలో జరిగిన ఈవీఎం ఘటనపై అత్యున్నత ధర్మాసనం కూడా ఫోకస్ చేసింది. వెంటనే ఏం జరిగిందో డీటెయిల్ రిపోర్ట్‌ ఇవ్వాలని ఈసీ తరపు లాయర్‌కు ఆర్డర్ వేసింది. అయితే విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను కంప్లీట్‌గా కొట్టిపడేసింది ఈసీ. నాలుగు వీవీప్యాట్‌లో తప్పు జరిగింది.. నిజమే. కానీ వీవీప్యాట్ ప్రింట్ చేసిన స్లిప్‌పై నాట్ టు బి కౌంటెడ్ అనే మెసేజ్ ప్రింట్ అయ్యి ఉంది. దానిపై బీజేపీ సింబల్ వచ్చింది. అంటే ఈ ఓటును కౌంట్ చేయవద్దని స్లిప్ ఉంది.

అయితే బీజేపీ సింబల్ ప్రింట్‌ అవ్వడంపై ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది ఈసీ.. ఈవీఎం మెషిన్లలలో ఫస్ట్‌ ఉన్న క్యాండిడెట్ పార్టీ గుర్తు ప్రింట్ అయ్యిందని. ఇక్కడ బీజేపీ ఉంటే బీజేపీది.. లేదంటే మరో పార్టీకి చెందిన అభ్యర్థి ఉంటే ఆ పార్టీ గుర్తు ప్రింట్ అయ్యేదని చెప్పింది. వెంటనే ఈ విషయాన్ని గుర్తించి వాటిని సరిచేశామని కోర్టుకు తెలిపింది. మరోసారి చెక్ చేసినప్పుడు అన్ని మెషిన్స్ సరిగ్గా పనిచేశాయంది. అంతేకాదు.. ఒకసారి బీజేపీకి ఓటు వేస్తే రెండు సార్లు ఓటు పడటం అనేది పూర్తిగా అవాస్తవమంటూ కోర్టుకు తెలిపింది.

Also Read: ఈడీ దండయాత్ర.. ప్రతిపక్ష నేతలే ఈడీ టార్గెట్టా?

ఇది బీజేపీకి పడుతున్న ఓట్లపై అటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఇటు ఈసీ ఇస్తున్న క్లారిటీ.. ఇక ఎన్నికల్లో ఈవీఎంల పూర్తిగా తొలగించాలన్న దానిపై కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి అంటే.

దేశంలో ఎన్నికలు నిర్వహించడం అతి పెద్ద సవాలు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను వెనక్కు తీసుకెళ్లకూడదు. బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించిన సమయంలో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లలేదా? చాలా మంది జర్మనీ గురించి మాట్లాడుతున్నారు.. అక్కడి జనాభా ఎంత? మన దేశ జనాభా ఎంత? ఎన్నికల ప్రక్రియపై మనకు నమ్మకం ఉండాలి తప్ప దానిని వెనక్కి లాగకూడదు. ఓట్ల లెక్కింపులో కొన్ని అవకతవకలు ఉండవచ్చు. వాటిని సరిదిద్దాలి తప్ప.. మళ్లీ వ్యవస్థను వెనక్కి తీసుకెళ్లడం వద్దు. ఇవీ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు.

ఎట్ ది సేమ్ టైమ్.. అటు ఎన్నికల సంఘానికి కూడా కొన్ని ఆక్షింతలు వేసింది. ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛత ఉండాలి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు వివరంగా వివరించండి.. అని ఆదేశించింది. అంతేకాదు.. వీవీప్యాట్‌ను ట్యాంపరింగ్‌ చేస్తే విధించే శిక్ష ఏంటని ఈసీ తరపు లాయర్‌ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ వాదనలు ఇలా కొనసాగుతుండగానే ఇప్పుడు దేశంలో ఓ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఓటు వేసిన తర్వాత ఫిజికల్‌గా వీవీ ప్యాట్ స్లిప్ అందించాలి. వాళ్లు వేసిన పార్టీకే ఓటు పడిందని ఓటర్ నిర్దారించుకున్న తర్వాత దానిని బ్యాలెట్‌లో బాక్స్‌లో వేయాలి.

Also Read: Tejashwi Yadav Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్

సో ఓటర్ తాను అనుకున్న పార్టీకి ఓటు వేశాడా? లేదా? అన్నది క్లారిటీ వస్తుంది. దీని వల్ల ఓట్లు రెండింటిలోనూ రికార్డ్ అవుతాయి. ఈ రెండింటి లెక్క సరిచూసిన తర్వాతే ఫలితాలను ప్రకటించాలి. ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్. లాస్ట్ ఇయర్ ఇండియా కూటమి నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. దీని వల్ల ఫలితాల ప్రకటన కాస్త లేట్ అవుతుంది కావొచ్చు.. కానీ పక్కాగా రిజల్ట్స్ వస్తాయన్న చర్చ ఉంది. కానీ దీనిపై ఈసీ నోరు మెదపడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఈ అంశం కూడా రానుంది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News