BigTV English

Manchu Vishnu : కన్నప్ప బడ్జెట్ పై విష్ణు ఫైర్.. ఐటీ వాళ్లను రప్పించాలనుకున్నారా?

Manchu Vishnu : కన్నప్ప బడ్జెట్ పై విష్ణు ఫైర్.. ఐటీ వాళ్లను రప్పించాలనుకున్నారా?
Advertisement

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) చాలా రోజుల తర్వాత వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన త్వరలోనే కన్నప్ప సినిమా(Kannappa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భక్త కన్నప్ప అనే భక్తుడు శివుడి పై తనకు ఉన్నటువంటి భక్తిని ఏ విధంగా చాటి చెప్పారనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.


ఇక ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మించగా, ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు తన పిల్లలు కూడా నటించారు. అలాగే మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ వంటి వారందరూ కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఈ స్టార్ సెలబ్రిటీలందరూ ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ సినిమా బడ్జెట్(Budget) గురించి కూడా ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐటీ అధికారులు వస్తారు…


నిజానికి కన్నప్ప సినిమా చేయాలన్నది విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ సినిమా కోసం తాను పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానని, ముందుగా ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్లాన్ చేశాము కానీ అది పెరుగుతూ వచ్చిందని పలు సందర్భాలలో తెలియచేశారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విష్ణుకి ఈ సినిమా బడ్జెట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు విష్ణు సమాధానం చెబుతూ.. ఈ సినిమాకు మేము పెట్టిన బడ్జెట్ త్రిబుల్ డిజిట్స్ లోనే ఉందని తెలిపారు. విష్ణు ఈ విధమైనటువంటి సమాధానం చెప్పడంతో 100 కోట్లు కూడా త్రిబుల్ డిజిటే కదా… ఎంత ఖర్చు చేశారు అంటూ మరోసారి ప్రశ్న వేశారు.. ఇప్పుడు  నా నుంచి ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామో చెప్పించి ఐటి వాళ్ళను రప్పించాలని అనుకుంటున్నారా అంటూ విష్ణు కాస్త ఘాటుగా సమాధానం చెప్పారు. అసలే మా వాళ్లకు ఐటి అధికారులు అంటే చాలా భయమని , మా వాళ్ళు టాక్స్ లు కూడా చెల్లిస్తున్నారని విష్ణు తెలిపారు.

ఓజీ కంటే ఎక్కువనే…

ఇకపోతే ప్రస్తుతం రాబోతున్న సినిమాల తరహాలోనే మీ బడ్జెట్ ఉంటుందా? అంటూ మరోసారి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్నది రాజా సాబ్ (The Raaja Saab), పవన్ కళ్యాణ్ ఓజీ(OG) సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఓజీ సినిమాకు కూడా 200 కోట్ల వరకు బడ్జెట్ అయింది, ఆ రేంజ్ లో మీ సినిమా బడ్జెట్ ఉంటుందా? అంటూ ప్రశ్న ఎదురైంది.. అంతకుమించే ఉంది అంటూ విష్ణు కన్నప్ప సినిమా బడ్జెట్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విష్ణు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కన్నప్ప సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారని స్పష్టమవుతుంది. మరి ఈయన సినిమా కోసం పెట్టిన మొత్తం రాబట్టగలరా? ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×