Daylight Murder| ఒక యువకుడు కారులో నుంచి దిగి.. నడి రోడ్డు మీద పట్టపగలు తన రెండు చేత్తుల్లో తుపాకులు పట్టుకొని కాల్పుల జరిపాడు. ఆ సమయంలో అక్కడ జనం తిరుగుతూనే ఉన్నారు. అయినా ఏ మాత్రం భయపడకుండా ఆ వ్యక్తి కాల్పులు జరిపి అరుస్తూ.. తిరిగి కారులో కూర్చొని వెళ్లిపోయాడు. ఈ దాడిలో ఒక యువకుడు చనిపోయినట్లు సమాచారం. ఈ దాడి జరిగిన ఘటన మొత్తం ఒక వీడియోలో రికార్డ్ అయింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక దారుణ సంఘటన జరిగింది. అశు మోంగా అనే 28 ఏళ్ల యువకుడు.. ఒక సంవత్సరం బిడ్డకు తండ్రి, అతని ఇంట్లో భార్య, వృద్ధ తల్లిదండ్రులున్నారు. ఫిరోజ్ పూర్ నగరంలోని సర్క్యులర్ రోడ్డుపై బహిరంగంగా కాల్పులకు గురై ఆశు మోంగా మరణించాడు. దాడి చేసిన వ్యక్తుల్లో ఒకడు రెండు చేతుల్లో పిస్టల్స్ పట్టుకొని.. పోలీసులు, చట్టం, న్యాయవ్యవస్థ పట్ల ఏ మాత్రం భయంలేకుండా కాల్పులు జరిపాడు.
ఈ హత్య జరిగిన ప్రదేశం మఖు గేట్ సమీపంలో.. నగరంలోని దేవ్ సమాజ్ కాలేజ్ ఫర్ విమెన్ నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న ఒక కేఫ్ ఎదురుగా ఉంది. అశు మోంగా ఒక టాటూ షాప్‌లో ఉండగా.. ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిపై విడివిడిగా కాల్పులు జరిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ముఖాలు కప్పుకున్న ఈ యువకులు ఎలాంటి భయం లేకుండా కాల్చారు. అశు స్నేహితుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దాడి చేసినవారు గాలిలో కాల్పులు జరిపారు.
కొందరు ఈ సంఘటనను మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక వీడియోలో, పసుపు రంగు టీ-షర్టు ధరించిన దాడి చేసినవాడు రెండు చేతులతో పిస్టల్స్‌తో కాలుస్తూ ఉండడం కనిపిస్తూ ఉంది. మరొక వ్యక్తి తప్పించుకునే సమయంలో అతని ఆయుధం నుంచి మ్యాగజైన్ పడిపోగా.. అతడు తిరిగి వచ్చి దాన్ని తీసుకున్నాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అశు మోంగాపై దాడి చేసినవారు అతని స్నేహితులే. కొన్ని రోజుల క్రితం వారి మధ్య ఒక గొడవ జరిగింది. ఫిరోజ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపిందర్ సింగ్ మాట్లాడుతూ.. ఇది గ్యాంగ్ వార్ కాదని, ఈ సంఘటనలో పాల్గొన్న వారంతా ఒకరికొకరు తెలిసినవారేనని చెప్పారు. అశు కొన్ని రోజుల క్రితం తన స్నేహితులతో వాగ్వాదం చేసుకున్నాడని, కోపంతో వారు అతడిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
Also Read: కస్టమర్లను మోసం చేసిన బ్యాంకు అధికారి.. కోట్లు దోచుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు
పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హత్య ఆరోపణల కింద కేసు నమోదు చేస్తున్నారు. అశు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరా సోషల్ మీడియాలో ఈ సంఘటనపై స్పందిస్తూ.. “పంజాబ్‌లో శాంతి భద్రతల సమస్య ఉంది. పోలీసులు, చట్టం అనే వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పింది! ఫిరోజ్‌పూర్‌లో మధ్యాహ్నం గ్యాంగ్‌స్టర్లు కాల్పులు జరిపిన వీడియో చూశాను. ఈ కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. ఇదా రంగీలా పంజాబ్?” అని రాశారు.
ఈ ఘటనతో ఫిరోజ్‌పూర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఈ కేసులో విచారణలో భాగంగా.. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
These visuals aren’t from a web series or movie they’re from Ferozepur City Punjab, where two gangs opened fire on each other in broad daylight. One person lost their life in the gang war. Lawlessness at its peak. pic.twitter.com/j6KFsNH1we
— Gagandeep Singh (@Gagan4344) June 5, 2025