Kannappa Hard Disk: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్ప (Kannappa)సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఇటీవల ఈ సినిమా గురించి షాకింగ్ విషయం బయటపెట్టారు. సినిమాకు సంబంధించి ఒక హార్డ్ డిస్క్ (Hard Disk) మాయమైందని వార్త బయటకు వచ్చింది. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం స్పందించారు. కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ కొద్ది రోజుల క్రితమే మాయమైందని,అయితే ఈ విషయంలో మనోజ్ ను (Manoj)అనుమానించడానికి మాకు ఇష్టం లేకపోవడంతోనే సైలెంట్ గా ఉన్నాము. కానీ ఈ విషయం సోషల్ మీడియాలో ఎలా లీక్ అయిందో తెలియదు. ఈ దొంగతనంలో మేము అనుమానిస్తున్న వారు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారనీ చెప్పడంతో ఈ విషయం కాస్త మరోసారి సంచలనంగా మారింది.
మనోజ్ ఇంటి మనుషులేనా…
ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నైలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పారు. ఇక చాలామంది తన ఫ్యామిలీ ఇష్యూస్ గురించి అడుగుతున్నారని తెలిపారు. అయితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాంటి గొడవలు ఉంటాయని, అందరి ఇళ్లల్లో గొడవలు ఉండటం సర్వసాధారణమని తెలిపారు. ఇక హార్డ్ డిస్క్ విషయం గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. హార్ట్ డిస్క్ గత కొద్ది రోజుల క్రితమే మిస్ అయిందని అయితే మనోజ్ ఇంట్లో పని చేసే రఘు, చరిత అనే ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. అయితే వీరు ఈ పనిని వారి సొంత ఆలోచనతోనే చేశారా లేకపోతే వారి వెనుక ఎవరైనా ఉండి ఇలాంటి పని చేయించారా అనేది తెలియాల్సి ఉందని తెలిపారు.
మనోజ్ ప్రమేయం ఉందా…
ఇక మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నారని తెలుస్తోంది.. మన పురాణాల ఆధారంగానే ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.. ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలందరూ కూడా భాగమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ,మోహన్లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ మోహన్ బాబు వంటి వారందరూ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అంశంలో భారీగా విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ విమర్శలు అన్నింటిని ఎదుర్కొంటూ మంచు విష్ణు ఈ సినిమాని విడుదల చేయబోతున్న నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయం కావటం ఒక్కసారిగా సంచలనాలను సృష్టించింది. మొదటిసారి విష్ణు మనోజ్ పేరును పలకడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి విష్ణు చేసిన ఈ ఆరోపణలపై మనోజ్ రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
BREAKING 🚨
The hard disk was stolen a few days ago. We stayed silent, not wanting to blame Manoj, but the news leaked on social media.
Some say the suspects were working at Manoj's house. Whether he was involved or not, I don’t know.
– #ManchuVishnu pic.twitter.com/kI823Z9L4S
— Movies4u Official (@Movies4u_Officl) May 30, 2025