Vizag Beach: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తుఫాన్ హెచ్చరికలు అలానే ఉన్నాయి. దీనితో అక్కడక్కడా సముద్రం ముందుకు వచ్చిన ఘటనలు జరిగాయి. కానీ ఒక తీర ప్రాంతం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడికి వెళ్లే పర్యాటకులు కూడా షాక్ కు గురయ్యారు. అన్ని చోట్ల సముద్రం ముందుకు రావడం జరిగితే, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ స్థితి ఎక్కడ ఉందో అనుకొనేరు.. ఏపీలోని విశాఖ తీరప్రాంతంలో..
అసలేం జరిగిందంటే?
విశాఖపట్నం బీచ్ అంటే అందమైన అలలు, సందడిగా పర్యాటకులు, సముద్రపు మోజులో పయనించే నౌకలు. కానీ శుక్రవారం మాత్రం విశాఖవాసులు చూసిన దృశ్యం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సముద్ర జలాలు అర కిలోమీటరు దూరం వెనక్కు వెళ్లిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తుఫాన్ సీజన్ నడుమ ఇలా జరిగిందంటే ఇది సామాన్యమైన విషయం కాదని వారి అభిప్రాయం. అయితే ఇది వాస్తవంగా ఏమిటి? ప్రకృతి హెచ్చరికా? భూకంప సూచనా? లేక వేరే కారణమా? అనేది తెలుసుకుందాం.
ఏం జరిగింది?
విశాఖబీచ్ వద్ద శుక్రవారం సాయంత్రం సముద్రతీరంలో నీరు క్రమంగా వెనక్కు వెళ్లిపోతూ కనిపించింది. సాధారణంగా తుఫాన్ సమయాల్లో సముద్రం ముందుకు వచ్చి తీరాన్ని ముంచే ప్రమాదం ఉంటుందనుకుంటాం. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా సముద్రం వెనక్కు వెళ్లిపోయింది. సముద్రపు మట్టం తక్కువవడంతో రెండున్నర గంటల పాటు తీరాన్ని పూర్తిగా వెలిసిపోయినట్లుగా స్థానికులు గమనించారు.
ప్రజల్లో ఆందోళన
ఈ దృశ్యం చూసిన పర్యాటకులు, స్థానికులు మొదట భయపడ్డారు. కొంతమంది దీన్ని భూకంపానికి ముందస్తు సంకేతంగా భావించగా, మరికొందరు సునామీ లక్షణాలా? అంటూ కలవరపడ్డారు. కానీ వాతావరణ శాఖ మాత్రం ఇలా జరగటం సాధారణమేనని చెప్పింది. అయితే ఈసారి దీన్ని తుఫాన్ సమయంలో చూసినందున ప్రజల్లో ఆందోళన ఎక్కువయ్యింది.
తుఫాన్ కాలంలో సముద్రం ఎందుకు వెనక్కు వెళుతుంది?
సాధారణంగా తుఫాన్‌లు సముద్రాన్ని ముందుకు తోసేలా ప్రభావితం చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో, చక్రవాత గాలులు తీరానికి వ్యతిరేక దిశగా వీస్తే, సముద్రపు నీరు తీరంవద్ద తగ్గిపోతుంది. ఈ తరహా గాలులు offshore winds అనే పేరుతో కూడా పిలవబడతాయి. ఇవి నీటిని తీరానికి దూరంగా తోసేస్తాయి. ఫలితంగా సముద్రం వెనక్కు వెళ్లినట్లుగా అనిపిస్తుంది.
Also Read: Visakha Wonders: విశాఖలో అద్భుతం.. ఇప్పుడే చూసేయండి.. మళ్లీ ఆ ఛాన్స్ రాదు!
టిడల్ రెట్రీట్.. దీన్ని శాస్త్రీయంగా ఏమంటారు?
ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు Tidal Retreat, Sea Receding Phenomenon అని పిలుస్తారు. ఇది తుఫాన్ల కారణంగా ఏర్పడే ఒత్తిడి మార్పులు, గాలి తీరానికి వ్యతిరేకంగా వేగంగా వీయడం, లోవ్ టైడ్ (Low Tide) సమయంలో మరింతగా నీరు వెనక్కు వెళ్లడం ఇలాంటి కారణాలతో ఏర్పడుతుంది. సాధారణంగా ఇది తీర ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తుంది. కానీ తుఫాన్ సమయంలో గమనించగలిగితే ఇది ప్రజల్లో భయాన్ని కలిగించగలదు. కానీ వాతావరణ ఒత్తిడి మార్పుల వల్ల మాత్రమే ఈ మార్పులు వచ్చాయని అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ దృశ్యం తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖలో సముద్రం మాయం, బీచ్ వెనక్కు వెళ్లిపోయింది వంటి శీర్షికలతో ప్రజలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలను వైరల్ చేశారు. ఇలాంటి దృశ్యం చూసే అవకాశమంటే చాలా అరుదు. దీనిని ప్రత్యక్షంగా చూశామని చెప్పుకునేందుకు పర్యాటకులు బీచ్ వద్ద బారులు తీరి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అయితే అధికారులు ప్రజలను అత్యంత జాగ్రత్తగా వ్యవహరించమని, బీచ్‌కు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. విశాఖలో సముద్రం వెనక్కు వెళ్లిన సంఘటన, ఇది ఒక వింత అనిపించినా, శాస్త్రీయంగా నిగ్గు తేలిన ప్రక్రియ. ప్రజలు భయపడకుండా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఉండాలి. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు మనకు ఒక గమనించదగిన పాఠమే. అలాంటి వింతలు మానవ మనస్సును ఆలోచింపజేస్తాయి, ప్రకృతి మహిమను మనం మరింతగా అర్థం చేసుకునేలా చేస్తాయి.