BigTV English

Kannappa Release : కన్నప్ప ఇప్పట్లో ఇక రాదప్ప… మరోసారి వాయిదా కన్ఫర్మ్..?

Kannappa Release : కన్నప్ప ఇప్పట్లో ఇక రాదప్ప… మరోసారి వాయిదా కన్ఫర్మ్..?

Kannappa Release : కష్టాలు మనుషులకే వస్తాయి అన్నట్టు… కష్టాలు అన్నీ కన్నప్పకే వస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కన్నప్ప మూవీలోని పలు కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మిస్ అయింది అంటూ వస్తున్న వార్తలు అందరూ చూస్తున్నారు. హార్డ్ డిస్క్ పోయినా.. దాని కాపీ మాత్రం భద్రంగానే ఉంటుంది అనుకోవచ్చు. అయితే ఈ మిస్ అయిన హార్డ్ డిస్క్ వల్ల సీన్స్ లీక్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. దీనికి వెనక ఎవరు ఉన్నారు అనేది పక్కన పెడితే.. పాపం కష్టాలన్నీ కన్నప్పకే వస్తున్నాయని చెప్పడం మాత్రం నిజం.


ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా… వీఎఫ్ఎక్స్ పనులు అని, మంచు ఫ్యామిలీ గొడవలు అని వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వస్తుంది. అలాగే, ఈ సినిమాపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదు… ఈ ట్రోల్స్ పై ఇప్పటికే కన్నప్ప టీం పోలీసులను కూడా ఆశ్రయించింది. ఇల గడియ గడియ ఓ గండం అన్నట్టు కన్నప్ప ప్రయాణం సాగుతుంది.

ఇప్పుడు అందుతున్న వార్త విన్న తర్వాత మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అనే సామేత గుర్తు వస్తుంది. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న కన్నప్ప టీంకు వాయిదా (Kannappa Postponed) టెన్షన్ పట్టుకుందట.


ఓటీటీ డీల్…?

కన్నప్ప మూవీ జూన్ 27న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దీని కోసం అన్నీ రెడీ చేసుకున్నారు. అయితే… ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ ఇప్పటి వరకు కూడా అవ్వలేదట. కొన్ని ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చినా… నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడంతో.. ఆ డీల్ అలాగే పెండింగ్‌లోనే ఉండిపోయిందట. జూన్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓటీటీ డీల్ కాకముందే సినిమా రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తున్నారట.

హార్డ్ డిస్క్ మిస్సింగ్..?

దీనికి తోడు హార్డ్ డిస్క్ మిస్సింగ్ అనేది కూడా ఇప్పుడు మూవీ టీంకి ఓ సవాల్ గా మారిపోయింది. కొన్ని సీన్స్ ఎడిటింగ్ కోసం ముంబై లోని ఓ స్టూడియోస్ కి రా ఫైల్స్ పంపించారట. అక్కడ ఎడిటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ను ఓ హార్డ్ డిస్క్ లో పెట్టి.. కొరియర్ చేశారట. ఆ కొరియర్ ను ఇక్కడ ఓ ఆఫీస్ బాయ్ తీసుకున్నాడట. అప్పటి నుంచి ఆ ఆఫీస్ బాయ్, ఇంకో మహిళ కనిపించకుండ పోయారట. దీంతో మూవీ టీం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, ఇక్కడ… హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వల్ల పోయేదేం లేదు. ముంబై స్టూడియోస్ దగ్గర ఒరిజినల్ ఫైల్స్ ఉంటాయి. కానీ, ఆ మిస్ అయిన హార్డ్ డిస్క్ లో నుంచి సీన్స్ లీక్ అయితే… పరిస్థితి ఏంటి..? అనేదే ఇప్పుడు మూవీ టీం ముందు ఉన్న సమస్య.

అందుకే సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయకుండా.. ఆ హార్డ్ డ్రైవ్‌ను తిరిగి సంపాదించి… సీన్స్ లీక్ కాకుండా… జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా… కన్నప్ప ఇప్పట్లో వచ్చేది లేదు అప్పా… అనేదే నిజం అంటున్నారు ఇండస్ట్రీలో…

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×