BigTV English

Manchu Vishnu : మంచు బాబు బర్త్ డే సందర్భంగా ” కన్నప్ప” నుంచి క్రేజీ అప్డేట్..

Manchu Vishnu : మంచు బాబు బర్త్ డే సందర్భంగా  ” కన్నప్ప” నుంచి క్రేజీ అప్డేట్..

Manchu Vishnu : మంచు విష్ణు.. అదేనండి మన మిమర్స్ కు ఎంతో ఫేవరెట్ అయిన స్నో బ్రదర్.. చేసినవి కొన్ని సినిమాలైనా తన డైనమిక్ పెర్ఫార్మన్స్ తో మంచు విష్ణు హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇప్పుడు ఏకంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఇండియా వైడ్ పెద్ద చర్చనీయాంశంగా మారాడు. దీనితో పాటుగా మూవీకి సంబంధించి అప్డేట్స్ క్రేజీగా విడుదల చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


పేరుకు ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. అయితే వాస్తవానికి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. ఈ మూవీలో అన్ని సినీ ఇండస్ట్రీ ల నుంచి టాప్ మోస్ట్ స్టార్స్ నటిస్తున్నారు. పైగా ఇండియాలో ఎక్కడ కాదు అనుకొని షూటింగ్ 80% న్యూజిలాండ్ లో ప్లాన్ చేయడంతో బడ్జెట్ ఓ రేంజ్ లో పెరిగింది. అయినా.. తగ్గేదే లేదంటూ మంచు విష్ణు భక్తకన్నప్ప షూటింగ్లో బిజీ గా ఉన్నాడు.

ఈ మూవీలో కోలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. తమిళ్ సీనియర్ స్టార్ శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటుగా ఆల్ ఫేవరెట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. భక్తకన్నప్ప క్యారెక్టర్ లో మంచు విష్ణు నటించిగా మంచు మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.


నిజానికి భక్త కన్నప్ప కథ జరిగింది తిరుపతి దగ్గర ఉన్న శ్రీకాళహస్తి పరిసర ప్రాంతా అడవులలో. కాబట్టి అందరూ దీన్ని షూటింగ్ శేషాచలం అడవుల్లో జరుగుతుందనే భావించారు. అయితే మంచు విష్ణు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా న్యూజిలాండ్ షూటింగ్ కి ఎంచుకున్నారు. అక్కడ సుందరమైన అడవులలో ఈ మూవీ షూటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉండబోతోంది అని టాక్. 

ఇక నవంబర్ 23 మంచు విష్ణు పుట్టినరోజు ఉండనే ఉంది. మామూలుగా హీరో పుట్టినరోజు ఉంటే అతను నటించే ఏదో ఒక మూవీ నుంచి అప్డేట్ ఉండాల్సిందే కదా.అందుకే మంచు విష్ణు స్వయంగా తన పుట్టినరోజు నాడు తాను నటిస్తున్న చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ విడుదల కాబోతుందని క్రేజీగా ప్రకటించాడు. ఈ రోజు విడుదల చేయబోయే ఈ క్రేజీ అప్డేట్ తర్వాత మూవీపై అంచనాలు ఎలా ఉంటాయో చూడాలి.

విలక్షణమైన నటనతో ఎప్పుడూ అందరినీ ఎంటర్టైన్ చేసి మంచు విష్ణు కి బిగ్ టీవీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×