Manchu Vishnu : తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. విలన్ గా హీరోగా పలు సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసులుగా ఆయన కొడుకులు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుపోవడమో లేక అదృష్టం కలిసి రాకపోవడం కానీ వాళ్ళు స్టార్డం అందుకోలేకపోయారు.. మంచు మనోజ్ వారసుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈమధ్య హిట్ సినిమాలు లేకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఛానెల్స్ మంచు విష్ణు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఘటనపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘కన్నప్ప ‘ మూవీ..
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి అందులో నటిస్తున్న పలువురి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.. పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు.. ఇక ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళు ఎందుకు మంచు విష్ణు చాలానే కష్టపడుతున్నాడని తెలుస్తుంది తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు మంచు విష్ణు..
పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన పై షాకింగ్ రియాక్షన్..
ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీ లోకి రావాలంటే వారసత్వం ఒక్కటే ఉంటే సరిపోదు టాలెంట్ కూడా కావాలని మంచు విష్ణు అన్నారు. టాలెంట్ లేకుంటే ఇండస్ట్రీలో నిలబడడం కష్టమని ఆయన అన్నారు. కన్నప్ప మూవీ కోసం చాలా కష్టపడుతున్నాం జనాలకు ఈ మూవీ బాగా నచ్చుతుందని ఆయన అన్నారు. అనంతరం పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన గురించి ప్రశ్న ఎదురయింది.. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సెలబ్రిటీలు పలు జాగ్రత్తలు తీసుకొని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వాస్తవానికి ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటకు రావడం వంటివి బన్నీ ఫ్యామిలీ ని మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ అయ్యిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ఘటన భవిష్యత్తులో మరేదో హీరో కైనా జరగవచ్చు. ఇలాంటి పరిణామాలతో నటులు సినిమా ధియేటర్లోకీ వెళ్లి సినిమాలు చూసే అవకాశం ఉండకపోవచ్చు అన్నారు.. అందుకే హీరోలు జాగ్రత్తగా ఉండాలని మంచు విష్ణు అన్నారు.. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..