Manchu Vishnu :మంచు ఫ్యామిలీ (Manchu Family).. సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో వీరు చేస్తున్న పనుల వల్ల ఎక్కువగా నెగెటివిటీని మూటకట్టుకుంటున్నారు. ఆస్తుల కోసమే అన్నదమ్ములు ఇద్దరు గొడవపడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అటు తనను ఇంటి నుండి గెంటేసారని , తన అన్న మంచు విష్ణు (Manchu Vishnu) వల్లే తనకు అన్యాయం జరిగిందని.. మంచు మనోజ్ (Manchu Manoj) బహిరంగంగా చెబుతున్న విషయం తెలిసిందే.
దీనికి తోడు విష్ణు ని టార్గెట్ చేస్తూ మనోజ్ చేసే కామెంట్లు, పనులను బట్టి చూస్తే విష్ణు కావాలని మనోజ్ ని తన తండ్రికి దూరం చేస్తున్నాడని, అటు బహిరంగంగా కూడా మనోజ్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. పైగా పోలీస్ స్టేషన్ లు, కోర్ట్ లు, కలెక్టర్ ఆఫీసులు అంటూ మంచు మోహన్ బాబు (Manchu Mohanbabu) , మంచు మనోజ్ ఇద్దరూ తిరిగారు. దీంతో ఇంట్లో జరగాల్సిన గొడవ కాస్త వీధికి ఎక్కింది.
మనోజ్ కి విష్ణు ఓపెన్ ఆఫర్..
ఇకపోతే మరోవైపు కుటుంబంలో ఇంత గొడవ జరుగుతున్నా కూడా.. విష్ణు మాత్రం తన కుటుంబంలో జరిగే విషయాలపై స్పందించను అని ఒకప్పుడు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. కానీ జరుగుతున్న పరిణామాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మనోజ్ పై ఇన్ డైరెక్టుగా కౌంటర్లు వేశారు. ఇంకా వీరిద్దరి మాటలను బట్టి చూస్తే.. ఇక వీరు కలిసేలా కనిపించడం లేదు అని చాలామంది అనుకున్నారు. కానీ సడన్గా మంచు విష్ణు తన తమ్ముడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు.
ఈ మేరకు మంచు విష్ణు తన అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ పంచుకున్నారు. ఇక ఆ ట్వీట్ లో ఏముందనే విషయానికి వస్తే..”జీవితం విలువైనదే అయినప్పటికీ అనూహ్యమైనది. కొన్ని సంఘటనలు ఒక్క క్షణాన్ని కూడా తేలికగా తీసుకోకూడదని మనకు గుర్తు చేస్తాయి. ప్రతిరోజూ గౌరవిద్దాం, కృతజ్ఞతను వ్యక్తపరుద్దాం, మన ప్రియమైన వారిని దగ్గరగా ఉంచుకుందాం.. మనకు వీలైన చోటల్లా సానుకూలతను వ్యాప్తి చేద్దాం. దృఢంగా ఉండండి, కృతజ్ఞతతో ఉండండి”. అంటూ ట్వీట్ పెట్టాడు.
విష్ణు కోరిక మేరకు మనోజ్ అన్నతో కలుస్తారా?
ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇది చూసిన చాలామంది మంచు విష్ణు ఏకంగా తన తమ్ముడికి ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాడు. తమ్ముడిని దగ్గరకు తీసుకుంటానని చెబుతున్నాడు. మరి ఇకనైనా మంచు మనోజ్ తన అన్నతో కలిసిపోయి కుటుంబ సమస్యలను సాల్వ్ చేసుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి మంచు విష్ణు కోరిక మేరకు మనోజ్..తన అన్నతో కలుస్తారా? లేదా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మనోజ్ సినిమాలు..
ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) నటిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.
మంచు విష్ణు సినిమాలు..
ఇక మరొకవైపు మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికైతే ఇద్దరూ కూడా సినిమాల పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్నారు. ఇటు వ్యక్తిగత విషయాలను కూడా చక్కబెట్టుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
also read:Deepika Padukone : సందీప్ రెడ్డితో వివాదం.. దీపికాకు ఆ అర్హత ఉంది అంటున్న స్టార్ డైరెక్టర్!
Life is precious yet unpredictable. Some incidents remind us never to take a single moment for granted. Let’s cherish every day, express gratitude, hold our loved ones closer, and spread positivity wherever we can. Stay strong, stay grateful. 🌟❤️ #HarHarMahadev
— Vishnu Manchu (@iVishnuManchu) June 13, 2025