Deepika Padukone : బాలీవుడ్ నటీ దీపికా పదుకొనే(Deepika Padukone) రీసెంట్ గా ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)డైరెక్షన్లో ప్రభాస్(Prabhas ) నటించే స్పిరిట్ మూవీ (Spirit Movie)లో హీరోయిన్ గా మొదట దీపికాను తీసుకున్నారు డైరెక్టర్. అయితే అంతా ఓకే అనుకున్నాక హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేసిందని,ఈ కారణంతోనే దీపిక పదుకొనేని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమా నుండి తీసేసి యానిమల్ (Animal) బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) ని ప్రభాస్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో దీపికా పదుకొనే రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వినిపించాయి. అంతేకాదు దీపిక పదుకొనే సినిమా స్క్రిప్ట్ మొత్తం బయట చెప్పేసిందని, అగ్రిమెంట్ ప్రకారం అలా సినిమా గురించి ఎవరికీ చెప్పకూడదని,కానీ దీపిక పదుకొనే మాత్రం అగ్రిమెంట్ బ్రేక్ చేసిందని, సినిమా స్టోరీ మొత్తం చెప్పినా నాకు పోయేదేమీ లేదు అంటూ సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.
దీపికాకు అండగా బాలీవుడ్ డైరెక్టర్..
ఇక దీపిక డైరెక్టర్ వ్యాఖ్యలపై ఇండైరెక్టుగా ఓ ఈవెంట్లో స్పందించింది. “నా మనసు చెప్పిందే వింటా.. జీవితాంతం బ్యాలెన్స్ గా ఉండాలి అంటే కచ్చితంగా మనసు చెప్పిందే వినాలి. అందుకే నేను నా మనసు చెప్పిందే వింటాను”. అంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే దీపిక పదుకొనే రెమ్యూనరేషన్ వార్తలపై చాలామంది ఆమెను సపోర్ట్ చేశారు. కొంతమంది ఆమెని వ్యతిరేకించారు. అయితే తాజాగా ఓ డైరెక్టర్ రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే అందులో తప్పేముంది అంటూ దీపిక పదుకొనేకి సపోర్ట్ చేశారు. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్(Kabeer Khan)..
అడిగినంత ఇవ్వడంలో తప్పులేదు – డైరెక్టర్
ఆయన తాజాగా దీపిక పదుకొనే, సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)ల ఇష్యూ గురించి మాట్లాడుతూ.. “సినిమా కోసం హీరోలు, హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. అయితే అలా డిమాండ్ చేసినప్పుడు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఎక్కువ మంది అభిమానులు అభిమానించే నటీనటులకు తగిన పారితోషికం ఇవ్వడంలో తప్పేమీ లేదు. వాళ్ళు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వడంలో పోయేదేమీ లేదు కదా.అలాగే ప్రేక్షకాధరణ ఉన్న నటీనటులు ఎంత రెమ్యూనరేషన్ తీసుకోవడానికైనా అర్హులే అంటూ దీపిక పదుకొనేని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.
దీపికా కు పెరుగుతున్న సపోర్ట్..
ప్రస్తుతం ఈ డైరెక్టర్ వ్యాఖ్యలతో దీపిక అభిమానులు సంబరపడిపోతున్నారు.. అయితే హీరోలకు రూ.200 కోట్లు, రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు అందులో సినిమా మొత్తం కనిపించే హీరోయిన్లకు రూ. 25 కోట్లు ఇస్తేనే బడ్జెట్ అంతా పోతుందా..? హీరోలతో పాటు హీరోయిన్లు ఉంటేనే ఆ సినిమాను చూస్తారు. అలాంటప్పుడు హీరోయిన్లకు కూడా అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పేమీ లేదు.. ఇందులో కూడా స్త్రీ పురుష భేదాలు చూస్తారా అని చాలామంది నెటిజన్లు ఈ డైరెక్టర్ మాట్లాడిన మాటలను సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోలను ఒకలా హీరోయిన్లను ఒకలా చూస్తారని,రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోయిన్లను చీప్ గా చూస్తారంటూ తమ ఆవేదనలను బయటకు చెప్పుకున్న సంగతి మనకు తెలిసిందే..
ALSO READ:Gymkhana OTT: ఓటీటీలోకి వచ్చేసిన జింఖానా మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?