E-Paper
Advertisement

Kamal Haasan – Thug Life: థగ్ లైఫ్ నుంచి వీడియో రిలీజ్.. కమల్ ఎలా ఉన్నాడంటే..?

Kamal Haasan – Thug Life: థగ్ లైఫ్ నుంచి వీడియో రిలీజ్.. కమల్ ఎలా ఉన్నాడంటే..?
Advertisement

Kamal Haasan – Thug Life: విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ సినీ ప్రియుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ‘విక్రమ్’ మూవీతో కంబ్యాక్ అయిన కమల్ ఆ తర్వాత ‘కల్కి’ మూవీలో విలన్ రోల్ పోషించి తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఈ మూవీలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాడు. ఇక ఈ మూవీ తర్వాత ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇండియన2’.

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఉలగనాయగన్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. అదే ‘థగ్ లైఫ్’. ఈ సినిమా కమల్ హాసన్ సినీ కెరీర్‌లో 234గా సినిమాగా తెరకెక్కుతోంది.

Advertisement

Also Read: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి క్రేజీ అప్డేట్.. వీడియో రిలీజ్

కమల్ హాసన్ – ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జాయింట్ మూవీస్, మంద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో త్రిష, ఐశ్యర్యలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే స్టార్ హీరో శింబు, జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి వంటి స్టార్ యాక్టర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో స్టార్ కాస్టింగ్ ఇందులో భాగం కావడంతో అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. అందులోనూ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.

Advertisement

అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇక వారిలో ఫుల్ జోష్ నింపేందుకు మేకర్స్ తాజాగా సడెన్ సర్‌ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగా థగ్‌లైఫ్ మూవీ డబ్బింగ్ పనులు షురూ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ చిన్న వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో కమల్ హాసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అలాగే దర్శకుడు మణిరత్నం కూడా ఇందులో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో అప్డేట్‌తో సినీ అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది. ఇకపోతే ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్‌లు బయటకు రానున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×