E-Paper
Advertisement

Spirit: ప్రభాస్ డబుల్ రోల్.. బాక్సాఫీస్ ను ఆ దేవుడే కాపాడాలి.. ?

Spirit: ప్రభాస్ డబుల్ రోల్.. బాక్సాఫీస్ ను ఆ దేవుడే కాపాడాలి.. ?
Advertisement

Spirit (Telugu film news) : ఈ ఏడాది అంతా ప్రభాస్ నామ సంవత్సరంగా మారింది. ఆదిపురుష్, సలార్ అంతగా మెప్పించకపోయినా ఈ ఏడాది కల్కి 2898AD సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. కర్ణుడుగా డార్లింగ్ లుక్ కనిపించగానే ప్రేక్షకులు గుండెల్లో గుడి కట్టేశారు. ఇక కల్కి సెకండ్ పార్ట్ లో కర్ణుడుగా ప్రభాస్ నటనకు ఎన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.

ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ మాట ఇచ్చినట్టే ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాడు. ఇక కల్కి ప్రభంజనం ఇంకా తగ్గకముందే రాజాసాబ్ తో వచ్చేస్తున్నాడు. నేడు రాజాసాబ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఇప్పటివరకు యాక్షన్ మోడ్ లో చూసిన ప్రభాస్ ను చాలా కాలం తరువాత రొమాంటిక్ మోడీ లో చూడబోతున్నామని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇక ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే బ్రదర్.. అసలు సినిమా ముందు ఉంది. అదే స్పిరిట్. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ మూస పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టి.. అదే సినిమాను నార్త్ లో రీమేక్ చేసి అక్కడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని.. ఇక అనిమల్ సినిమాతో అసలైన అనిమల్ తనే అని నిరూపించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా.. ? అని ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇదే హైలైట్ అనుకుంటే.. ఇందులో డార్లింగ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఒక కటౌట్ కనిపిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతోంది.

Advertisement

డ్యూయల్ రోల్ లో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉండనుందని టాక్. అలాంటిది.. ఒకే సినిమాలో రెండు కటౌట్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఇక అంతే సంగతి. ఈ వార్త కనుక నిజమైతే.. బాక్సాఫీస్ ను ఆ దేవుడే కాపాడాలని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×