BigTV English
Advertisement

Thug Life Movie Update: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి క్రేజీ అప్డేట్.. వీడియో రిలీజ్

Thug Life Movie Update: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి క్రేజీ అప్డేట్.. వీడియో రిలీజ్

Kamal Haasan Starring Thug Life Movie Update: విలక్షణ నటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో ఫుల్ జోష్ లోకి వచ్చాడు. ఈ మూవీ ముందు వరకు వరుస ఫ్లాపులతో చాలా సఫర్ అయ్యాడు. చేసిన ప్రతి మూవీ బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలం అయ్యాయి. ఆ సమయంలో కమల్‌తో సహా ఆయన అభిమానులు సైతం కిక్కుమనలేని పరిస్థితి. ఇక వారు ఎగిరిగంతేసే సమయం ‘విక్రమ్’తో వచ్చింది.


లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ మూవీతో కమల్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమా కమల్‌తో పాటు ఆయన అభిమానుల ఆకలి తీర్చింది. దీంతో అందరిలోనూ ఆశలు చిగురించాయి. అనంతరం వరుస సినిమాలను కమల్ లైన్‌లో పెట్టేశాడు. అందులో క్రియేటివ్ దర్శకుడు శంకర్‌తో ‘ఇండియన్ 2’ మూవీ చేస్తున్నాడు.

అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే తన కెరీర్‌లో మరో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. అదే ‘థగ్ లైఫ్’. ప్రముఖ బడా దర్శకడు మణిరత్నం ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇది కమల్ కెరీర్‌లో 234వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో త్రిష, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Also Read: హీరోలు వెళ్లిపోతున్నారా.. వెళ్లగొట్టేస్తున్నారా..?

అంతేకాక స్టార్ హీరో శింబు, జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి వంటి స్టార్ హీరోల సైతం ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగానే తాజా షెడ్యూల్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో జరగుతోంది. ఈ షెడ్యూల్‌లో కమల్, శింబు పై వచ్చే ఆసక్తికర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి కమల్‌కు సంబంధించి ఓ పిక్ లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో కమల్ కోరమీసంతో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే శింబు కూడా బ్లాక్ గాగుల్స్‌తో స్టైలిష్ లుక్ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ మరో అప్డేట్‌ అందించారు. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి రేపు మరో అద్భుతమైన అప్డేట్ అందిస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు ‘సిగ్మా థగ్ రూల్’ అప్‌డేట్ రానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×