BigTV English

Maniratnam-Kamal Haasan: 36 ఏళ్ల తర్వాత .. కమల్, మణిరత్నం కాంబోలో మూవీ .. డీటైల్స్ ఇవే..!

Maniratnam-Kamal Haasan: 36 ఏళ్ల తర్వాత .. కమల్, మణిరత్నం కాంబోలో మూవీ .. డీటైల్స్ ఇవే..!

Maniratnam-Kamal Haasan: తరాలు మారుతున్న.. కొత్త డైరెక్టర్స్ అందరూ వస్తున్నా.. సినీ ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి మణిరత్నం. రీసెంట్ గా అతను తీసిన పొన్నియన్ సెల్వన్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీ మంచి గుర్తింపు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్న మణిరత్నం ప్రస్తుతం కమల్హాసన్ తో కలిసి తన నెక్స్ట్ మూవీ సెట్స్ పైకి తేవడానికి సిద్ధపడుతున్నారు.


కమల్ హాసన్ ,మణిరత్నం కాంబినేషన్లో చిత్రం వచ్చి ఇప్పటికి 36 సంవత్సరాలు గడుస్తోంది. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం నాయకుడు. కమల్ హాసన్ సినీ కెరియర్ కు ఒక రేంజ్ లో హైప్ ఇచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇన్ని సంవత్సరాలకి వీళ్లిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో రాబోయే చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

లోక నాయకుడు కమల్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం.. 35 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ.. ఎన్ని పాయింట్స్ కలవడంతో ఈ చిత్రం భారీగానే ఉంటుంది అని అంచనా. పైగా ఈ చిత్రం కమల్ కెరియర్ లో 234వ చిత్రం. కేవలం 5 నెలల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి 2024లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలి అని మణిరత్నం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం ఒకప్పటి టాప్ హీరోయిన్స్ లో మంచి క్రేజీ ఆఫర్స్ తెచ్చుకొని దూసుకుపోతున్న పొన్నియన్ సెల్వన్ బ్యూటీ త్రిష ఈ మూవీలో హీరోయిన్ గా నటించనుంది. అలాగే జయం రవి ,దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు టాక్. పక్కా ప్లానింగ్ తో త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతోంది. అయితే పొన్నియన్ సెల్వన్ 2 షూటింగ్ ను 150 రోజుల్లో పూర్తి చేసిన మణిరత్నంకు 5 నెలల్లో ఈ చిత్రం పూర్తి చేయడం పెద్ద కష్టం కాదు.

కమల్ ,మణిరత్నం కాంబినేషన్ లో మరో విశేషం ఏమిటంటే ఇద్దరికీ దాదాపు 65 ఏళ్ల వయసు. ఈ వయసులో కుర్ర హీరోలకు దీటుగా కమల్.. యంగ్ డైరెక్టర్ కు స్ఫూర్తి గా మణిరత్నం.. చాలా తక్కువ టైంలో మూవీ టార్గెట్ పూర్తి చేస్తే అంతకంటే పెద్ద విశేషం ఇంకొకటి ఉండదు అనే చెప్పాలి. మరి జెట్ స్పీడ్ లో తీయబోతున్న ఈ చిత్రం ద్వారా ఎటువంటి కంటెంట్ అందిస్తారో చూడాలి మరి. విక్రమ్ మూవీ తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కమల్ వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకు వెళ్తున్నాడు. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి లో కూడా కమల్ ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క శంకర్ ఇండియన్ 2 ఉండనే ఉంది. కమల్ 234 మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×