E-Paper
Advertisement

Virat Kohli : ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ కోహ్లి.. టాప్-10 లిస్ట్ ఇదే..!

Virat Kohli : ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ కోహ్లి.. టాప్-10 లిస్ట్ ఇదే..!
Advertisement

Virat Kohli: విరాట్ కొహ్లీ అంటే ఒక్క బ్యాట్స్ మేన్ అనే కాదు.. గ్రౌండ్ లో అడుగుపెట్టాడంటే చిరుత పులిలా లంఘిస్తాడు. బాల్ ని ఆపాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. స్లిప్పుల్లో తనని మించిన ఫీల్డర్ లేరంటే అతిశయోక్తి లేదు. ఇక గ్రౌండ్ లో తన వైపు నుంచి బాల్ వచ్చిందంటే చాలు… అత్యంత లాఘవంగా పట్టేస్తాడు.
అయితే వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లన్నింటిని కలిపి ఐసీసీ బెస్ట్ ఫీల్డర్ల జాబితాను విడుదల చేసింది. అందులో టాప్ వన్ గా విరాట్ కొహ్లీ నిలిచాడు.

Advertisement

 ఇప్పుడీ బెస్ట్ ఫీల్డర్ల జాబితా ప్రపంచ కప్ లో సంచలనం స్రష్టిస్తోంది. ఒక బ్యాట్స్ మెన్ అన్నవాడు  పరుగులు చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ గ్రౌండ్ లో ఎన్ని పరుగులను ఆపితే, అన్ని తను చేసినట్టే లెక్క అని అంటారు. అందుకే కొహ్లీ గ్రౌండ్ లో కూడా అంత కష్టపడుతూ ఉంటాడు. టీమ్ అందరిలో చైతన్యం నింపుతూ ఉంటాడు.

అయితే  టైటిల్ ఫేవరెట్ గా ఉన్న ఇండియా ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడింది. అన్నింటా విజయభేరి మోగించింది. అయితే మెగా టోర్నీలో అన్నిజట్లు 45 లీగ్ దశ మ్యాచ్ లు  ఆడతాయి. ఇప్పటికి  టోర్నీలో ఆడుతున్న 10  జట్లు కూడా  మూడేసి మ్యాచ్ లు ఆడేశాయి.

Advertisement

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరనే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎంపిక చేసింది. ఈ మేరకు 10 మంది క్రీడాకారుల పేర్లను విడుదల చేసింది. అందులో టాప్ 1లో ఇండియన్ స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ ఉన్నాడు.

22.30 రేటింగ్ పాయింట్లను కొహ్లీకి ఐసీసీ కేటాయించింది. ఈ టోర్నీలో మూడు క్యాచ్ లను కొహ్లీ అందుకున్నాడు. తన తర్వాత 21.73 పాయింట్లతో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ ఉన్నాడు. మూడోస్థానంలో డేవిడ్ వార్నర్ (21.32) నిలిచాడు.
టాప్ టెన్ లో  ఇండియా నుంచి ఇషాన్ కిషన్ 13 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ ఎంపిక చేసిన బెస్ట్ ఫీల్డర్స్ వీరే… డెవనా కాన్వే (15.54),
షాదాబ్ ఖాన్ (15.13), గ్లెన్ మ్యాక్స్ వెల్ (15), రెహ్మత్ షా (13.77), మిచెల్ శాంట్నర్ (13.28), ఫకర్ జమాన్ (13.01) ఉన్నారు.

అందరికి బాధ కలిగించేదేమిటంటే టీమిండియాలో అత్యుత్తమ ఫీల్డర్ గా పేరొందిన రవీంద్ర జడేజాకు ఇందులో స్థానం దక్కలేదు. మరో మూడు మ్యాచ్ ల తర్వాత మళ్లీ కౌంట్ చేసి, అప్పుడు ఐసీసీ బెస్ట్ ఫీల్డర్ పేర్లను ప్రకటిస్తుందని అంటున్నారు. మరి అందులోకేమైనా జడ్డూ వస్తాడేమో చూడాలి.

Related News

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

Big Stories

Advertisement
×