Manchu Manoj: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అంశం మంచు కుటుంబంలో గొడవలు. వాస్తవానికి ఎప్పటినుంచో అన్నదమ్ములు ఇద్దరి మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఏకంగా మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య గొడవలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ చేసే పనులు మోహన్ బాబు కి నచ్చవు అన్న విషయాలు పలుమార్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే..దీనికి తోడు కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి మనోజ్ చేసుకోవడంతో ఈ మాట పట్టింపులు మరింత పెరిగిపోయాయి అని తాజాగా ఆ ఇంటి పనిమనిషి కూడా వెల్లడించింది.
పరస్పర కంప్లైంట్ ఇచ్చుకున్న తండ్రీ కొడుకులు..
ఇకపోతే ఇటీవల మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు బాగా వినిపించాయి. కానీ దీనిపై మోహన్ బాబు టీమ్ స్పందించి గొడవలేమీ లేవని, ఇది కేవలం కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. కానీ అంతలోపే మనోజ్ గాయాలతో హాస్పిటల్లో కనిపించడంతో ఇక అందరూ గొడవలు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. దీనికి తోడు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు అనుచరులైన పదిమంది తనపై తన భార్యపై అలాగే ఏడు నెలల తన కూతురిపై కూడా దాడి చేశారని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో మోహన్ బాబు కూడా తనకు తన కొడుకు మనోజ్, కోడలు భూమా మౌనిక నుండి ముప్పు పొంచి ఉందని, వాట్సప్ ద్వారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా వీరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యాయం కోసం అధికారులను కలుస్తున్న మంచు మనోజ్..
అయితే ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బు, ఆస్తికోసం తాను పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నానని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ముఖ్యంగా సంఘటన జరిగిన సమయంలో సిసిటీవీ ఫుటేజ్ రికార్డులను కూడా తన అన్న మంచు విష్ణు(Manchu Vishnu) వ్యాపార భాగస్వామి అయిన విజయ్ ధ్వంసం చేయడంతో ఇక తన వద్ద ఆధారాలు లేవని, అయితే తనకు న్యాయం కావాలి అని, పలువురు అధికారులను కలుస్తున్నారు మనోజ్, మౌనిక దంపతులు. ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఈయన తాజాగా ఇంటలిజెన్స్ కార్యాలయానికి కూడా చేరుకున్నారు.ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని మనోజ్ దంపతులు వివరించనున్నారు.
రక్షణ కావాలంటూ డీజీని కోరిన మంచు మనోజ్ దంపతులు.
తనపై దాడి, సీసీ కెమెరా ఫుటేజ్ క్లియర్ చేయడం, తనను ఇంట్లో నుంచి బయటకి గెంటేయ్యడం లాంటి వాటిపై ఫిర్యాదు చేస్తున్నాడు. తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై డీజీ కి ఫిర్యాదు చేసిన ఈయన , తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు సమాచారం. ఇక తనకు న్యాయం జరిగే వరకూ అధికారులను కలుస్తానని చెబుతున్న మంచు మనోజ్ కి ఎవరు ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాలి. అసలు ఈయనకు న్యాయం జరుగుతుందా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.